
Balan – The Boy Review : కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ బ్యానర్స్ పై వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బాలన్ – ది బాయ్’. ఆవేశం డైరెక్టర్ జితూ మాధవన్ అంది
ంచిన స్క్రిప్ట్ తో మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిశేషన్, ఫర్జానా తల్లి కొడుకులుగా మళయాళంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ జూన్ 19న రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసింది.
ఓ తల్లి తన చిన్న కొడుకుతో జైలు నుంచి బయటకు వస్తుంది. జైలుకు సంబంధించిన కాంటాక్ట్స్ అన్ని వదులుకొని తాము ఎవ్వరికి తెలియని ప్లేస్ లో ఫేక్ పేర్లతో పనిలోకి చేరుతుంది. అక్కడ్నుంచి ఎవరికి అనుమానం వచ్చినా, ఎవరైనా బంధాలు కలుపుకుందాం అనుకున్నా తన కొడుకుతో మాయమైపోయి ఇంకో చోట కొత్త పేర్లతో కొత్త జీవితం మొదలుపెడుతుంది. అలా ఊర్లు తిరుగుతూ, పేర్లు మార్చుకుంటూ తల్లి కొడుకులు బతుకుతుంటారు. ఓ రోజు తను పనిచేసే ఇంట్లో బాబు చనిపోవడంతో అతని ఐడెంటిటీస్ తీసుకొని, బస్టాండ్ లో కనపడిన ఓ పిచ్చి మహిళ ఐడెంటిటీ తీసుకొని తన కొడుకుతో కలిసి ఓ గ్రామంలో ఒంటరిగా ఉండే ముసలావిడ దగ్గర షెర్లీ అనే పేరుతో పనికి చేరుతుంది. తన కొడుకుని వాసుదేవ్ అనే పేరుతో స్కూల్ లో చేరుస్తుంది. రోజూ ముసలావిడని చూసుకోవడం, దూరంగా రోడ్డు మీదకు వెళ్లి కొడుకుని స్కూల్ బస్ ఎక్కించి సాయంత్రం వెళ్లి తీసుకురావడం చేస్తుంది.
ఆ ముసలావిడకి తన గతాన్ని ఇండైరెక్ట్ గా చెప్పడంతో ఆమె చనిపోయినా ఇక్కడే జీవించు అని చెప్పి చనిపోతుంది. జైల్లో తనకు కాంటాక్ట్ ఉన్న ఓ మహిళ ఈమెని వెతుక్కుంటూ రావడంతో ఆమెని చంపి పాతేస్తుంది. ముసలావిడ చనిపోయినట్టు విదేశాల్లో ఉన్న ఆమె కొడుక్కు చెప్పకపోవడంతో వాళ్ళు సడెన్ గా వస్తారు. ఆమె వాళ్ళను చంపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో బాబు కోసం ఆ రోజు సాయంత్రం ఆమె వెళ్ళకపోవడంతో చాలా సేపు బాబు రోడ్డు మీద ఉన్నాడని తెలిసి పోలీసులు ఆ చిన్న పిల్లాడిని కస్టడీలోకి తీసుకుంటారు. షెర్లీని ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ బాబుని పోలీసులు ఏం చేస్తారు? మళ్ళీ తల్లి కొడుకులు కలుస్తారా? అసలు ఆ తల్లి కొడుకులు ఎవరు? వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఎందుకు పేర్లు మార్చుకొని ఊర్లు తిరుగుతూ బతుకుతూ ఉంటారు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
మళయాళం సినిమాలు ఇటీవల తెలుగులో కూడా థియేటర్స్ లో, ఓటీటీలలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక మళయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మన దగ్గర ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే ఈ బాలన్ – ది బాయ్. మళయాళం సూపర్ హిట్ సినిమాలు ఆవేశం డైరెక్టర్ స్క్రిప్ట్ రాయగా మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం డైరెక్ట్ చేసాడు అనడంతో ఈ సినిమాపై మళయాళంతో పాటు తెలుగులో కూడా అంచనాలు నెలకొన్నాయి.
తల్లి కొడుకులు జైలు నుంచి బయటకు వచ్చే సీన్ తో సినిమా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ సగం అంతా తల్లి కొడుకులు పేర్లు మారుతూ, ఊర్లు తిరుగుతూ ఉంటారు. ఆ సీన్స్ అన్ని ఆసక్తిగా సాగుతాయి. ముసలావిడ దగ్గర సెటిల్ అయిన దగ్గర్నుంచి కాస్త సాగదీసినా తల్లి ఏం చేస్తుందా అనే క్యూరియాసిటీ అయితే నెలకొంటుంది. ఇంటర్వెల్ కి తల్లి కొడుకులు దూరం అవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. సెకండ్ హాఫ్ అంతా ఆ పిల్లడు పెద్దయి తల్లిని వెతుక్కుంటూ రావడం, ఆ పిల్లాడి ఫ్లాష్ బ్యాక్ తో సాగుతుంది. సెకండ్ హాఫ్ లో చిన్న పిల్లాడు తల్లికి దూరమయ్యే ఎమోషన్ మాత్రం బాగా వర్కౌట్ అయినా ఆ తర్వాత కాస్త సాగదీశారు. టోవినో థామస్ పాత్రని బాగా సాగదీశారు. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఎవరూ ఊహించని ట్విస్ట్ తో క్లైమాక్స్ ఎండ్ చేస్తారు.
ఆ తల్లి ఫ్లాష్ బ్యాక్ ఇండైరెక్ట్ గా చెప్పినా అసలు వీళ్ళు ఎందుకు పేర్లు మార్చుకొని బతుకుతున్నారు అనేది క్లారిటీ ఉండదు. జైలు నుంచి బయటకు రాగానే పోలీస్ ఓ NGO కి వెళ్లి బతకమని చెప్పినా ఎందుకు వద్దు అనుకొని ఇలా ఊర్లు పట్టుకు తిరుగుతారో క్లారిటీ ఇవ్వలేదు. కొత్త జీవితం మొదలుపెట్టే అవకాశం ఉన్నా ఎందుకు వద్దు అనుకుంటుందో తెలియదు. ఇక క్లైమాక్స్ కూడా ఇన్నేళ్లు తల్లి ఎక్కడ ఎలా ఉందొ క్లారిటీ లేకుండానే సింపుల్ గా ఒక్క మాటతో ముగించేశారు. సెకండ్ పార్ట్ కి కూడా అవకాశం ఉండేలా లీడ్ ఇవ్వడం గమనార్హం. చాలా మళయాళం సస్పెన్స్ సినిమాలు వచ్చినా కేవలం తల్లి కొడుకు పాత్రలతో ఏదో ఉంది అని క్యూరియాసిటీ పెంచుతూ తల్లి కొడుకులు కలుస్తారా అనే ఎమోషన్ తో బాలన్ కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించారు. థియేటర్స్ లో ఎంతవరకు నడుస్తుందో చెప్పలేం కానీ ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక మాత్రం తెలుగు వాళ్ళు బాగా ఆదరిస్తారు.
చైల్డ్ ఆర్టిస్ట్ ఆదిశేషన్ బాగా పెర్ఫార్మ్ చేసాడు. చాలా తక్కువ మాట్లాడుతూ పర్ఫార్మెన్స్ అదరగొట్టేసాడు. తల్లి పాత్రలో ఫర్జానా కూడా చాలా బాగా నటించింది. టోవినో థామస్ గెస్ట్ పాత్రలో కాసేపు మెరిపించాడు. ముసలావిడ పాత్రలో నటించిన నటి కూడా వీల్ చైర్ లోనే ఉంటూ బాగా నటించింది. పోలీస్ పవిత్రన్ పాత్రలో చేసిన నటుడు, చైల్డ్ ఆర్టిస్ట్ పెద్దయిన పాత్రలో నటించిన నటుడు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే పెర్ఫార్మ్ చేసారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. కేరళ సినిమాలు అంటే లొకేషన్స్ అదిరిపోతాయి అని తెలిసిందే. ఈ సినిమాలో కూడా లొకేషన్స్ విజువల్ పరంగా చాలా బాగుంటాయి. ఎడిటింగ్ లో సెకండ్ హాఫ్ లో టోవినో థామస్ పార్ట్ కొంత ల్యాగ్ కట్ చేయాల్సింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. పాటలు యావరేజ్. కేవలం తల్లి కొడుకులు మెయిన్ లీడ్ లో సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా దర్శకుడు బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘బాలన్ ది బాయ్’ సినిమా చాలా మళయాళ సినిమాల్లాగే మెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.