
‘డబుల్ ఆక్యుపెన్సీ’ చిత్ర సక్సెస్ మీట్లో ఖుష్బూ సుందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్న చిత్రం ఇంతటి సక్సెస్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని, మనం నిర్మించే సినిమా ప్రేక్షకులను అలరించాలని, వారు
చెల్లించే డబ్బుకు తగిన విలువ ఉండాలని అన్నారు.
మనం నిర్మించే చిత్రాలు ప్రేక్షకులను అలరించేలా ఉండాలని ప్రముఖ నటి ఖుష్బూ పేర్కొన్నారు. అవ్నీ మూవీస్ పతాకంపై రూపొందిన ‘డబుల్ ఆక్యుపెన్సీ’ (Double Occupancy) చిత్రం గతవారం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని తాజాగా చిత్రబృందం చెన్నై నగరంలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఖుష్బూ (Khushbu Sundar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె ఖుష్బూ మాట్లాడుతూ.. ‘‘చిన్న చిత్రం ఇంతటి సక్సెస్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మనం నిర్మించే సినిమా ప్రేక్షకులను అలరించాలి. వారు చెల్లించే డబ్బుకు తగిన విలువ ఉండాలి అని నా భర్త సుందర్ అంటుంటారు. ఈ చిత్రంతో ఆయన మాటలను మేము కూడా నిజం చేశాం. గత కొన్ని రోజులుగా నేను ఎంతో బిజీగా ఉన్నాను. నా పెద్ద కుమార్తె పెళ్ళి పనుల్లో బిజీగా ఉంది. నా భర్త సుందర్ ‘పురుషన్’ షూటింగ్, పెళ్ళి పనుల్లో క్షణం తీరికలేకుండా ఉన్నారు. నా చిన్న కుమార్తె ఈ చిత్ర నిర్మాణ పనులు చూసుకుంది. ఈ సినిమా నిర్మాణంలో పలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ, వాటిని ఆమె విజయవంతంగా అధిగమించింది. నా పెద్ద కుమార్తె రెండు చిత్రాల్లో నటిస్తోంది. మరో నాలుగు చిత్రాలకు కమిట్ అయింది. గతంలో ఒక హీరోయిన్.. ప్రేమ, పెళ్ళి వంటి అంశాలపై మాట్లాడేందుకు భయపడేది. ఇప్పుడు కాలంతో పాటు అంతా మారిపోయింది’’ అని పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులకు, ఇప్పటి ట్రెండ్‌కు చాలా వ్యత్యాసం ఉందంటూ ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నటీమణుల వ్యక్తిగత విషయాలు, ప్రేమ, పెళ్లి వంటి అంశాలపై గతంలో ఉన్న భయాలు, అపోహలు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయని ఆమె స్పష్టం చేయడం... అదే సమయంలో తన ఇద్దరు కుమార్తెలు కూడా సినిమా రంగంలో వేర్వేరు విభాగాల్లో రాణిస్తారని చెప్పడం చూస్తుంటే.. ఆమె ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతోంది. కాలంతో పాటు మారిన ఆలోచనలను అందిపుచ్చుకుంటూ.. ఇటు ఫ్యామిలీ బాధ్యతలను, అటు సినీ కెరీర్‌ను తమ కుటుంబం బ్యాలెన్స్ చేస్తున్న తీరు.. నిజంగానే ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంటోంది.
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!
రుక్మిణి వసంత్ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్!
హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు