
ఈటీవీ భారత్: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. కన్నబిడ్డల ముందే ఆమె కాళ్లూచేతులు కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు.
గుండు గీసి, ముఖానికి మసితోపాటు ఇంజిన్ ఆయిల్ పూసి.. బలవంతంగా మూత్రం తాగించాడు. ఈ నెల 14న గ్రామంలో బహిరంగంగా జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. తార, జితేంద్ర ఘసియా 2006లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. భార్య మీద అనుమానం పెంచుకున్న జితేంద్ర తరచూ ఆమెను వేధించేవాడు. దీంతో ఏడాదికాలంగా ఆమె భర్తకు దూరంగా ఉంటూ తనను ఆదరించిన వ్యక్తితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన జితేంద్ర భార్యను ఇంటి నుంచి బయటకు లాగి గ్రామస్థులు అందరి ముందు అమానుషంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 18న నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు కొరియా ఏఎస్పీ సురేశ్ చౌబే తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.