
Yuvraj SIngh : టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించడంలో కీలక పాత్ర పోషించిన లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇప్పుడు మెంటార్‌గా, కోచ్‌గా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఫ్రాంచైజీ తమ కోచింగ్ బృందంలో యువరాజ్ సింగ్‌ను చేర్చుకోవడానికి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గతంలో ప్లేయర్‌గా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, పుణే వారియర్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన సుదీర్ఘ అనుభవం యువరాజ్‌కు ఉంది. తనకున్న అపారమైన క్రికెట్ పరిజ్ఞానంతో మైదానంలో దూకుడుగా ఆడే యువరాజ్, ఇప్పుడు కోచ్‌గా ఢిల్లీ జట్టును ఎలా నడిపిస్తారనే అంశంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
Read Also : 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం యువరాజ్ సింగ్ రాకతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. గతంలో ఈ ఫ్రాంచైజీకి అడ్వైజర్‌గా, టీమ్ డైరెక్టర్‌గా సేవలందించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు గట్టి సమాచారం.
ఈ సరికొత్త కోచింగ్ స్టాఫ్‌ను గంగూలీనే ముందుండి నడిపిస్తారని, ఆయన పర్యవేక్షణలోనే యువరాజ్ సింగ్ గ్రౌండ్లో కోచింగ్ బాధ్యతలు చూసుకుంటారని తెలుస్తోంది. కొత్త కోచింగ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రాబోయే సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆటగాళ్ల ఎంపిక మరియు వ్యూహాల పరంగా భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.
ఈ ఇద్దరు దిగ్గజాల కలయికతో ఐపీఎల్లో ఇంతవరకు కప్పు గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ తలరాత మారుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. JIO : జియో కు ఏడాది లోనే 1.46లక్షలకోట్ల రెవెన్యూ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
కృషి చేస్తాము.
IPL 2027 updates: ఐపీఎల్ 2027 బిగ్ అప్డేట్.. బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?
IPL 2027 Schedule Update: వచ్చే ఏడాది 2027 ఐపీఎల్ షెడ్యూల్లో భారీ మార్పులు!
Team India Record : టీమిండియా అన్వాంటెడ్ రికార్డ్
India vs Afghanistan Match : 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
Surya Vaibhav : నేనైతే వైభవ్ ను పక్కన పెట్టేవాడిని మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
India vs Afghanistan Match : గిల్, ఇషాన్ సెంచరీలు.. ఇండియా భారీ స్కోరు
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు