
Rahul Gandhi : తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే (DMK), కాంగ్రెస్ కూటమి మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీతో కాంగ్రెస్ జతకట్టిందనే ప్రచారంతో డీఎంకే నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ రాజకీయ వేడి మరియు ఇరు పార్టీల స్థానిక నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపధ్యంలోనే.. నేడు లోక్‌సభ ప్రతిపక్ష నేత (LoP) రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నప్పటికీ, జాతీయ స్థాయిలో అగ్రనేతల మధ్య సఖ్యత ఇంకా బలంగానే ఉందనే విషయాన్ని ఈ పరిణామం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి స్టాలిన్ అందించిన పుట్టినరోజు శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు.
“భారతదేశం అనే మహోన్నత భావనను, దేశ రాజ్యాంగాన్ని, అలాగే రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని గౌరవించే సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలనే ఉమ్మడి సంకల్పమే మనకు మార్గదర్శకం” అని రాహుల్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తమకున్న పెద్ద లక్ష్యాన్ని గుర్తు చేస్తూ..
ఈ ఆశయాల సాధనలో పూర్తి విజయం లభించే వరకు మనమిద్దరం కలిసికట్టుగా పోరాటం కొనసాగిద్దామని స్టాలిన్‌కు ఆయన పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ ద్వారా తమిళనాడులో స్థానికంగా వస్తున్న రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, కేంద్రంలోని అధికార పీఠాన్ని ఎదిరించే క్రమంలో కాంగ్రెస్-డీఎంకే బంధం విడిపోబోదనే స్పష్టమైన సంకేతాన్ని రాహుల్ గాంధీ పంపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Revanth Reddy: ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Mandir: రామమందిర విరాళాల వివాదం..నృపేంద్ర మిశ్రా సంచలన వ్యాఖ్యలు
Yogi Adityanath : అయోధ్య రామమందిరం విరాళాల స్కాంపై సీఎం యోగి వార్నింగ్
Abhijeet Dipke Letter: పరీక్షల లోపాలతో బలవన్మరణాలు: బాధితులకు రూ. 1 కోటి పరిహారం ఇవ్వాలని ప్రధానికి లేఖ
NEET-UG : నీట్ యూజీ పునఃపరీక్ష వేళ.. విద్యార్థులకు సెలవులు ఇవ్వవద్దని వైద్య కళాశాలలకు కేంద్రం సూచన
Mukesh Ambani’s satellite plan: ముకేశ్ అంబానీ భారీ శాటిలైట్ ప్లాన్.. జియో నెక్స్ట్ లెవెల్ రోడ్ మ్యాప్ చూస్తే మైండ్ బ్లాకే!
Ayodhya Ram