
Bolla Brahmanaidu: హైదరాబాద్ శివార్లలోని గండిపేట పరిధిలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ల్యాండ్‌ను నకిలీ జీవోల (ఫేక్ గవర్నమెంట్ ఆర్డర్స్) సాయంతో కబ్జా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్సార్సీపీ మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడికి రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఈ భూకబ్జా కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (EOW) పోలీసులు బ్రహ్మనాయుడిని మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టగా, విచారణ అనంతరం న్యాయస్థానం బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
Read also: Gudivada Amarnath Comments on Anitha : అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు పోలీసుల కస్టడీ విచారణ సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు దర్యాప్తు అధికారులకు అస్సలు సహకరించలేదని తెలుస్తోంది. విచారణలో భాగంగా అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన స్పష్టమైన సమాధానాలు చెప్పలేదని, కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించారని పోలీసులు కోర్టుకు నివేదించారు.
అయితే, మాజీ ఎమ్మెల్యే తరఫు న్యాయవాదులు ఈ వాదనలను తోసిపుచ్చారు. పోలీసుల కస్టడీ గడువు ఇప్పటికే ముగిసిందని, నిందితుడిని జైల్లో ఉంచాల్సిన అవసరం లేనందున ఆయనకు బెయిల్ పొందే అర్హత ఉందని గట్టిగా వాదించారు. ఉభయ పక్షాల లాయర్ల వాదనలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా కోర్టు..
బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు చేయడానికి మొగ్గు చూపింది. అయితే బెయిల్ ఇచ్చే క్రమంలో కొన్ని కఠినమైన షరతులను విధించింది. గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Gudivada Amarnath Comments on Anitha : అమర్నాథ్ కు మహిళా కమిషన్ నోటీసులు Vizag techie Radha Gayatri death
: వైజాగ్ టెకీ గాయత్రి మృతిపై కన్నవారి సంచలన అనుమానాలు!
Gooty suicide case: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లితో గొడవలే కారణమా?
Gade Sai Krishna missing case: సాయికృష్ణ కేసు: దోషులను వదిలేది లేదు.. సీఎం చంద్రబాబు
Annadata Sukhibhava: అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల..ఎప్పుడంటే?
Palasa crime: రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలతో సహా తల్లి బలవన్మరణం