
కోడిగుడ్లను పగలగొట్టాక పెంకులను శుభ్రం చేయండి. పెంకు పైభాగాన్ని జాగ్రత్తగా కట్ చేసి, వాటిని చిన్న చిన్న ప్లాంటర్లుగా మార్చుకోవచ్చు. గుడ్డు పెంకులను హ్యాంగింగ్ డెకరేషన్‌గా వాడుకోవచ్చు. ఒక తాడు తీసుకుని దానికి రంగులు వేసిన గుడ్డు పెంకులను అక్కడక్కడా కట్టండి.
చివర్లో ఒక చిన్న గంటను వేలాడదీయండి. నాటు కోడిగుడ్డు పెంకుల రంగు ముదురుగా ఉంటుంది. వాటితో ఇలా చిన్న చీమ బొమ్మను కూడా తయారు చేసి టేబుల్‌పై పెడితే మంచి ఎస్తెటిక్ లుక్ వస్తుంది. గుడ్లు తెచ్చే అట్టపెట్టెను కూడా వాడుకోవచ్చు. ఇది కార్డ్‌బోర్డ్‌తో తయారవుతుంది.
దీన్ని క్యూట్ తాబేలుగా మార్చుకోవచ్చు. ఒక పొడవాటి గ్లాసులో క్యాండిల్ పెట్టండి. దాని చుట్టూ చిన్నవి, పెద్దవి గుడ్డు పెంకులను ఒకదానికొకటి అతికించండి. వాటి మధ్యలో చిన్న చిన్న పువ్వులు పెడితే సరి. చిన్న చిన్న గుడ్డు పెంకులకు రంగులు వేసి, వాటిపై చుక్కలు పెట్టండి.
వాటికి కింద వైపున పుల్లను అంటించి ఏదైనా ఫ్లవర్ వాజ్లో పెడితే చూడటానికి చాలా బాగుంటుంది. గుడ్డు పెంకులను చిన్న ముక్కలుగా పగలగొట్టండి. ఇప్పుడు ఒక షీట్‌పై కుందేలు లేదా మరేదైనా జంతువు బొమ్మ గీసి, దానిపై ఈ చిన్న పెంకు ముక్కలను అంటించవచ్చు.
Honeymoon : హనీమూన్ వెళ్లాలా? ఇండియాలో ఈ 6 ప్లేసెస్ చాలా సేఫ్ Blouse Designs: 30 ఏళ్లు దాటిన మహిళలకు సూటయ్యే బ్లౌజు డిజైన్లు Toe Ring Designs: ఈ మెట్టెలతో మీ పాదాలకు సరికొత్త అందం.. ఓ లుక్కేయండి Nose Bali: జీన్స్, వెస్ట్రన్ వేర్ పైకి ఈ బాలి పెట్టుకుంటే అదిరిపోతారు