
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం కమలనాథులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీజేపీ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని శుక్రవారంనాడు ఏర్పాటు చేసింది.
బెంగళూరు: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం కమలనాథులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బీజేపీ అధిష్ఠానం ముగ్గురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని శుక్రవారంనాడు ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్సీ సీటీ రవి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ ఎమ్మెల్యే మహేష్ తెంగినకాయ్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఎన్డీయే అభ్యర్థుల ఓటమికి కారణమైన వారిని ఈ కమిటీ గుర్తించి జూన్ 25వ తేదీలోగా నివేదిక సమర్పిస్తుంది.
నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ, జేడీ(ఎస్) నుంచి ఆరేడుగురు, బీజేపీ తరఫున నలుగురి నుంచి ఐదుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు తమకు సమాచారం ఉందని చెప్పారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిని జాతీయపార్టీగా బీజేపీ ఎంతమాత్రం క్షమించేది లేదన్నారు.
ఈ చర్యకు ఎవరు పాల్పడి ఉండవచ్చనే దానిపై తమకు కొంత సమాచారం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంపై మాట్లాడేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అపాయింట్మెంట్ కోరానని, ఆయన సమయం ఇవ్వగానే ఢిల్లీకి వెళ్తానని విజయేంద్ర చెప్పారు.
బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ మనస్సాక్షి మేరకు కాంగ్రెస్‌కు క్రాస్ ఓటింగ్ చేశారని, తాము ఎవరినీ అడగలేదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తమకు మద్దతిచ్చారని అధికార కాంగ్రెస్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం సరికాదని, ఇందువల్ల బీజేపీపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు.
విరాళాల చోరీ వివాదంపై యోగి
దోషులను వదిలేది లేదు.. రామాలయం