
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Telangana Vanta Varpu 15 Years: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ఒక ఊపు ఊపేసింది. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన అపూర్వ ఘట్టం..
వంటా-వార్పు కార్యక్రమం జరిగి సరిగ్గా నేటికీ 15 ఏళ్లు పూర్తయింది.. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనిక దాకా.. ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి.. పొయ్యిలు వెలిగించి.. వంటలు వండి సగర్వంగా తమ నిరసనలు వ్యక్తం చేశారు.. నాడు కరీంనగర్ వీధులన్నీ తెలంగాణ నినాదంతో మారుమోగాయి..
ఈ అపూర్వ ప్రజా ఉద్యమ తీవ్రత అప్పట్లో ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన సంగతి కూడా తెలిసిందే.. ఉద్యమ జ్వాలగా మారిన వంటిల్లు.. నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వంటావార్పు కార్యక్రమం కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మిగలలేదు.. అదొక మహా జనజాతరను తలపించేసింది.
జాతీయ రహదారులతో పాటు ప్రధాన కూడలన్నీ వంటశాలలుగా మారిపోయాయి.. కుల మత వర్గ బేధాలు మరిచి అందరూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశారు.. వంటలు వండుతూనే.. మరోవైపు బతుకమ్మ ఆడుతూ.. ధూమ్ దాం అద్భుతమైన ఆటపాటలతో ఉద్యమ కళాకారులు ఉత్సాహాన్ని నింపారు..
అంతేకాకుండా కొన్ని చోట్ల పోలీసులు సైతం ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పటికీ.. ప్రజలు ఏమాత్రం వారి లాఠీ దెబ్బలకు లెక్కచేయకుండా దీనిని విజయవంతం చేశారు... నాడు రోడ్డుపై వండిన ప్రతి మెతుకు.. తెలంగాణ రాష్ట్ర కాంక్షను చాటి చెప్పిందని..
పొగ.. ఢిల్లీ పాలకుల కళ్ళకు కమ్మేలా చేసిందని నాటి ఉద్యమకారులు ఎన్నో వ్యాసాలు రాశారు.. తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి అని నమ్మకాన్ని.. ఈ వంటావార్పు కార్యక్రమం ప్రజల్లో బలంగా నాటింది. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు సైతం ఎండను లెక్కచేయకుండా రోడ్లపైనే గడిపేశారు..
సకలజనులు ఏకమైతే ఉద్యమం ఎంతటి ప్రరూపం దాల్చుతుందో.. ఈ కార్యక్రమం దేశానికి చూపించేలా చేసింది.. నాటి కరీంనగర్ పోరాటాల పటిమ.. ఆత్మగౌరవ నినాదం.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది.. 15 ఏళ్లు గడిచినప్పటికీ.. నాటి వంటావార్పు జ్ఞాపకాలు.. ఆ ఉద్వేగం, ఆ ఐక్యత తెలంగాణ ప్రజల గుండెల్లో నేటికీ ఒక అద్భుతమైన జ్ఞాపకం గానే మిగిలిపోయి ఉంది.. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో కరీంనగర్ సాధించిన ఈ పోరాటం ఎప్పటికీ ఒక మైలురాయిగానే నిలిచిపోయింది.. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతోమంది చేసిన త్యాగాలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ప్రతి పొయ్యి నుంచి వచ్చిన