
Vizag techie Radha Gayatri death: ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని (Techie) రాధా గాయత్రి ఘటనలో రోజుకో కొత్త మలుపు వెలుగుచూస్తోంది. తమ కుమార్తె మృతి సాధారణమైనది కాదని, దీని వెనుక అనేక సందేహాలు ఉన్నాయని గాయత్రి తల్లిదండ్రులు సత్యవతి, సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మేరకు వారు మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. గాయత్రి తండ్రి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మసూరీలో ఈ నెల 15న (జూన్ 15) గాయత్రి స్పృహ లేకుండా మంచంపై పడిపోయింది. ఈ క్రమంలో ఆమె భర్త (అల్లుడు) ఫోన్ చేసి..
గాయత్రి అపస్మారక స్థితిలో ఉందని, అయితే గుండె స్పందన ఇంకా తెలుస్తోందని, తక్షణమే అక్కడికి రావాలని సమాచారమిచ్చారు. Read Also: Asifabad couple murder: దంపతుల దారుణ హత్య.. పీరిల ఉదంతమే ప్రాణం తీసిందా..? అల్లుడి ఫోన్ రాగానే కంగారుపడిన తల్లిదండ్రులు తక్షణమే ఉత్తరాఖండ్‌కు పయనమయ్యారు.
అయితే, వారు ఘటనాస్థలానికి చేరుకునే లోపే అక్కడ అంతా జరిగిపోయింది. “మేము అక్కడికి వెళ్లేసరికే గాయత్రి ఉన్న గదిని, ఘటనాస్థలాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. అంతేకాకుండా, మాకు చూపించకుండానే అప్పటికే పోస్టుమార్టం కూడా పూర్తి చేసేశారు” అని సుధాకర్ పేర్కొన్నారు.
కన్నవారికి కనీసం సమాచారం పూర్తిగా ఇవ్వకుండా, వారు వచ్చే వరకు కూడా ఆగకుండా శవాన్ని పోస్టుమార్టంకు తరలించడం, ఆధారాలు లభించకుండా ఘటనాస్థలాన్ని క్లియర్ చేయడం వంటి చర్యల పట్ల గాయత్రి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ హడావుడి చూస్తుంటే తమ కుమార్తెది సహజ మరణం కాదని, దీని వెనుక పెద్ద మిస్టరీ దాగి ఉందని వారు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Gooty suicide case: డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లితో గొడవలే కారణమా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Gade Sai Krishna missing case: సాయికృష్ణ కేసు: దోషులను వదిలేది లేదు.. సీఎం చంద్రబాబు
Annadata Sukhibhava: అన్నదాతలకు శుభవార్త.. సుఖీభవ నిధుల విడుదల..ఎప్పుడంటే?
Palasa crime: రైలు పట్టాలపై ఇద్దరు పిల్లలతో సహా తల్లి బలవన్మరణం
NDA Government:కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం:కేంద్ర మంత్రి
Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు!