
రెండు రోజుల కిందట.. శ్రీలంక- చేతిలో టీమ్ఇండియా-ఏ సూపర్ ఓవర్లో ఓడిపోయింది. అప్పుడు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా లంక ప్లేయర్లు ప్రవర్తించారు. మనోడు కూడా ఏమాత్రం తగ్గలేదు. కాస్త ఘాటుగానే స్పందిస్తూ వారి మీదకు దూసుకెళ్లాడు.
ఆ తర్వాత అఫ్గాన్‌పై భారత్ గెలిచి ముక్కోణపు సిరీస్ ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ అఫ్గాన్-ఏతో శ్రీలంక తలపడింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి శ్రీలంకనే గెలవాలని భారత అభిమానులూ కోరుకున్నారు. ఇదేదో అఫ్గాన్ మీద కోపంతో కాదు.. శ్రీలంక వస్తేనే అసలైన మజా ఉంటుందని ఫ్యాన్స్‌కు తెలుసు.
అనుకున్నట్లుగానే ఆతిథ్య జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శ్రీలంక, భారత్, అఫ్గానిస్థాన్ A జట్లు ఢీకొట్టుకున్న ముక్కోణపు సిరీస్ ‘ఫైనల్’కు చేరుకుంది. టైటిల్ కోసం టీమ్ఇండియాతో శ్రీలంక-ఏ జట్టు ఆదివారం తలపడనుంది. సాధారణంగా ఇలాంటి మ్యాచ్‌లను మరీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.
కానీ, శ్రీలంక సూపర్ ఓవర్లో గెలిచి.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేయడం టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఇప్పుడు ఫైనల్‌కు శ్రీలంక రావడంతో టైటిల్‌పై ఆసక్తి కలిగింది. వైభవ్ ఎటాకింగ్ గేమ్‌తో లంక ప్లేయర్లను బెంబేలెత్తించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
వైభవ్ సూర్యవంశీ క్రీజ్‌లో ఉంటే.. ఎంతటి ప్రమాదకారో ఐపీఎల్లో చూశాం. ఇప్పుడు అతడిని శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టారు. అసలే కీలక మ్యాచుల్లో దూకుడుగా ఆడే తత్వం వైభవ్‌ది. అండర్-19 వరల్డ్ కప్‌లో సెంచరీల మోత మోగించాడు. మరి.. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి ఏంటో?
అనే చర్చ కూడా మొదలైంది. కనీసం 15 ఓవర్లపాటు అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే విధ్వంసమే సృష్టిస్తాడు. అరె.. అప్పుడెంత తప్పు చేశామో అని అనుకోక మానరేమో! లీగ్ స్టేజ్‌లో శ్రీలంక-ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 266 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.
. కానీ, 17 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 9 రన్స్ మాత్రమే చేయగలిగింది. క్రీజ్‌లో ఉన్న వైభవ్‌ను ఉద్దేశించి శ్రీలంక ఫీల్డర్లు ఏవో వ్యాఖ్యలు చేశారు. విషేన్ హలంబాగే అనే శ్రీలంక ప్లేయర్ చప్పట్లు కొడుతూ వైభవ్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. వైభవ్ కూడా ఏమాత్రం తగ్గకుండా అతడిపైకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మరో బ్యాటర్ సూర్యాంశ్ వెంటనే వైభవ్‌ను ఆపి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. మిగతా శ్రీలంక ప్లేయర్లు కూడా అందుకు సహకరించడంతో వివాదం సద్దుమణిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
శ్రీలంక కూడా 50 ఓవర్లలో సరిగ్గా 265/9 స్కోరు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ ఆడించారు