
దిల్లీ: జూన్ 21న జరగనున్న నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టతనిచ్చింది. ఎలాంటి పేపర్ లీక్ జరగలేదని తెలిపింది. ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని పేర్కొంది.
పరీక్షకు ముందు ఏ వ్యక్తీ, సంస్థకు ప్రశ్నపత్రాలు దక్కే అవకాశం లేదంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించొద్దని సూచించింది. NEET పేపర్ లీక్.. నిజం కాదు
|