
మోడల్ టెనెన్సీ యాక్ట్-2021 ప్రకారం ఇంటిని నివాసానికి అనుకూలంగా ఉంచే బాధ్యత యజమాని, అద్దెదారుడు ఇద్దరికీ ఉంటుంది. అయితే సాధారణ వినియోగం వల్ల ఇంటికి కలిగే చిన్నపాటి అరిగిపోవడం లేదా సహజంగా జరిగే మార్పులను నష్టం కింద పరిగణించరు.
అందువల్ల అలాంటి విషయాలపై యజమాని, అద్దెదారుడు మధ్య వివాదం అవసరం లేదని చట్టం సూచిస్తోంది. ఇంటికి సంబంధించిన ప్రధాన నిర్మాణ మరమ్మతులు పూర్తిగా ఇంటి యజమాని బాధ్యతగా చట్టం పేర్కొంటోంది. ఇంటికి పూర్తిగా పెయింటింగ్ చేయించడం, గోడల్లో పెద్ద పగుళ్లను సరిచేయడం, ప్రధాన తలుపులు, కిటికీల మరమ్మతులు, నీటి ప్రధాన పైప్లైన్ సమస్యలు, డ్రైనేజ్ లేదా మురుగు వ్యవస్థలో లోపాలు వంటి పనులన్నింటికీ అయ్యే ఖర్చును యజమానే భరించాలి.
రోజువారీ వినియోగంతో ఏర్పడే చిన్న సమస్యలను సాధారణంగా అద్దెదారుడు చూసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు బల్బులు మార్చడం, చిన్నపాటి ప్లంబింగ్ సమస్యలు, స్విచ్లు లేదా ఫ్యూజ్ల మరమ్మతులు, ఇంటి పరిశుభ్రత నిర్వహణ వంటి పనులు సాధారణ నిర్వహణ కిందకు వస్తాయి.
వీటికి సంబంధించిన ఖర్చును అద్దెదారుడే భరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అద్దెదారుడు పలుమార్లు చెప్పినా ఇంటి యజమాని మరమ్మతులు చేయించడానికి నిరాకరిస్తాడు. అలాంటి సందర్భాల్లో మోడల్ టెనెన్సీ యాక్ట్ అద్దెదారుడికి ప్రత్యేక హక్కును కల్పిస్తోంది.
ఇంటికి అత్యవసర మరమ్మతులు అవసరమైతే, యజమాని స్పందించకపోతే అద్దెదారుడు స్వయంగా ఆ పనులు చేయించుకోవచ్చు. ఆ పనుల కోసం తన ఖర్చుతో చెల్లించిన మొత్తాన్ని అద్దె నుంచి తగ్గించుకునే హక్కు కూడా చట్టం కల్పిస్తోంది. అద్దెదారుడు మరమ్మతుల ఖర్చును అద్దె నుంచి తగ్గించుకునే ముందు కొన్ని నిబంధనలు పాటించాలి.
మరమ్మతులు చేయించుకునే ముందు యజమానికి లిఖితపూర్వకంగా లేదా స్పష్టంగా సమాచారం ఇవ్వాలి. సమస్యను పరిష్కరించేందుకు అవకాశం కల్పించాలి. చట్టం ప్రకారం ఒక నెల అద్దెలో మరమ్మతుల పేరుతో తగ్గించే మొత్తం ఆ నెల అద్దె విలువలో 50 శాతానికి మించకూడదు.
గరిష్ఠంగా రూ.5,000 మాత్రమే తగ్గించుకోవచ్చు
మిగిలిన మొత్తం ఉంటే తర్వాతి నెలల్లో సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద అద్దె ఇంట్లో మరమ్మతుల విషయంలో ఎవరి బాధ్యత ఏమిటో మోడల్ టెనెన్సీ యాక్ట్-2021 స్పష్టంగా పేర్కొంది. పెద్ద నిర్మాణ పనులు, ప్రధాన మరమ్మతులు ఇంటి యజమాని బాధ్యత కాగా, రోజువారీ నిర్వహణ పనులు అద్దెదారుడి బాధ్యతగా ఉంటాయి. యజమాని మరమ్మతులు చేయించకపోతే అద్దెదారుడికి చట్టపరమైన హక్కులు కూడా ఉన్నాయి. అందువల్ల అద్దె ఒప్పందం చేసుకునే ముందు ఈ నిబంధనలను తెలుసుకోవడం ఇద్దరికీ ప్రయోజనకరం.
ఉదాహరణకు నెలవారీ అద్దె రూ.10,000 అనుకుందాం. ఒక నెలలో