
చంద్ర కేతు కలయిక వల్ల మేష రాశి వారికి గ్రహణ యోగం ఏర్పడుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉండాలి. పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది.
విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఉండదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. చంద్ర, కేతువుల కలయిక సింహ రాశిలోనే జరుగుతోంది. కాబట్టి, ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగరూకత అవసరం.
మానసిక ఒత్తిడి కూడా మూడూ రోజుల పాటూ కొనసాగుతుంది. ప్రేమలో కష్టాలు వస్తాయి. ఏ పనిని తొందరపడి త్వరగా చేయకండి. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులతో తిట్లు తినాల్సి రావచ్చు. ఈ రాశి వారు ఉద్యోగం, వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
పనిచేసే చోట ఈ రాశి వారికి వ్యతిరేకంగా కుట్రలు జరిగే అవకాశం ఉంది. కొన్ని కారణాల వల్ల సమాజంలో కూడా అవమానాలు ఎదురవ్వచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నవారికి పెద్ద నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులను ఏమాత్రం నమ్మకండి.
కొత్త పని ప్రారంభించాలనే ఆలోచన ఆపుకోండి. కుంభ రాశి వారు కెరీర్ లో కొంచెం ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ప్రయాణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆహారం విషయంలో నియంత్రణ అవసరం. లేకపోతే, పొట్ట సంబంధిత వ్యాధులు వచ్చి ఇబ్బంది పెట్టవచ్చు.
ఆర్థిక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోర్టు కేసులలో ఓటమి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి
.