
బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మించగలవని, రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు ప్రధాన సూత్రాలను ప్రత్యేకతలుగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని, ఈ అభివృద్ధి ప్రయాణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కోల్కతాలోని ఐటీసీ సోనార్ హోటల్లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో లోకేశ్ తన ప్రసంగంతో పెట్టుబడిదారులను ఆకట్టుకున్నారు.బెంగాల్ స్ఫూర్తి..
రాష్ట్రాల మధ్య పోటీ అవసరంఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "ఈ రోజు బెంగాల్ ఏది ఆలోచిస్తుందో, రేపు భారత్ అదే ఆలోచిస్తుందని చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. భారతదేశ మేధో, సాంస్కృతిక, ఆర్థిక ప్రయాణానికి కోల్కతాయే రాజధానిగా నేను భావిస్తాను.
బలమైన బెంగాల్ అంటే బలమైన భారతదేశం అని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని అన్నారు. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితో సమావేశమైన విషయాన్ని గుర్తుచేసుకుంటూ, అభివృద్ధి పట్ల ఆమె అంకితభావం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే దేశం పురోగమిస్తుందని, అదే సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుని తమ బలాలను పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు.
భూమి అనేది భారతీయులకు భావోద్వేగంతో కూడిన అంశమైనప్పటికీ, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులను ఎలా ఒప్పించగలిగామో పశ్చిమబెంగాల్ సీఎంకు వివరించినట్లు తెలిపారు.ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. మూడు ‘ఎస్’ ల మంత్రంప్రధాని నరేంద్ర