
దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత జననాయగన్ సినిమా విడుదల నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. అయితే, ఆయన సీఎంగా రెండు నెలలు అవుతున్నా, సినిమాకు మోక్షం లభించడం లేదు.
సినిమా విడుదలపై నమ్మకాలు కూడా సన్నగిల్లుతున్నాయి. సెన్సార్ బోర్డు, జననాయగన్ చిత్రం మధ్య సాగుతున్న వివాదం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ సినిమా విడుదల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకునేందుకు నిర్మాత ఏకంగా ఢిల్లీలోని సెన్సార్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఒకవేళ అక్కడ కూడా సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించకపోతే, డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మూవీ టీం నిర్ణయించుకుంది. గత కొద్ది నెలలుగా సెన్సార్ అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా ప్రయోజనం లేకపోవడంతో, చివరి ప్రయత్నంగా నిర్మాత ఢిల్లీకి బయలుదేరారు.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం మాయమైపోతున్న మాన్సూన్.. రైతుల్లో టెన్షన్ టెన్షన్ బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు