
నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ రాయబోయే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక కీలకమైన ప్రకటన చేసింది. జూన్ 21న జరగనున్న ఈ రీ-టెస్ట్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని, వేగంగా చేరవేయడానికి ఎన్టీఏ ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులతో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఒక అధికారిక వాట్సాప్ ఛానల్‌ను ప్రారంభించింది. అడ్మిట్ కార్డుల వివరాలు, పరీక్షా కేంద్రాల లేటెస్ట్ అప్డేట్లను ఈ ఛానల్ ద్వారా విద్యార్థులకు చేరవేయనున్నారు. అయితే, ఈ స్మార్ట్ వాట్సాప్ సేవ కేవలం +91 78279 80287 అనే నంబర్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.
అభ్యర్థులు తమకు అందిన సందేశాన్ని నమ్మడానికి ముందు.. సదరు నంబర్‌కు ఉన్న అధికారిక బ్లూ వెరిఫికేషన్ మార్క్ (Blue Tick), "నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ" అనే పేరును తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. దేశంలో ఇలాంటి పెద్ద పరీక్షలు జరిగేటప్పుడు విద్యార్థులను టార్గెట్ చేస్తూ జరిగే సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికే ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
అభ్యర్థులు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గత మే 3వ తేదీ పరీక్ష కోసం జారీ చేసిన పాత అడ్మిట్ కార్డులు జూన్ 21 రీ-టెస్ట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవు. అనేక మంది విద్యార్థులకు ఈసారి నూతన పరీక్షా కేంద్రాలను కేటాయించినందున కొత్త కార్డులను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, జూన్ 21 పరీక్ష కోసం ఇప్పటికే కొత్త అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, వారు మళ్లీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను కేవలం అధికారిక నీట్ వెబ్సైట్ ద్వారా మాత్రమే.. నేరుగా వెబ్సైట్ అడ్రస్‌ను మాన్యువల్‌గా టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.
క్లిక్ చేయడం ఏమాత్రం సురక్షితం కాదని ఎన్టీఏ గట్టిగా హెచ్చరించింది.
ఈ వాట్సాప్ సేవ కేవలం వన్‌వే బ్రోడ్కాస్ట్ మాత్రమే పనిచేస్తుందని ఎన్టీఏ గుర్తు చేసింది. పరీక్షల పేరుతో అభ్యర్థుల నుంచి వ్యక్తిగత వివరాలను, ఓటీపీలను లేదా ఎటువంటి నగదు చెల్లింపులను తాము ఎన్నడూ అడగబోమని సంస్థ క్లారిటీ ఇచ్చింది. "ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి", లేదా "మార్కులు పెంచుతాం" అంటూ ఫోన్లు, మెసేజ్‌లు చేసి ప్రలోభపెట్టే నకిలీ ఆఫర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి, అత్యంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించడానికి ఎన్టీఏ ఈ జాగ్రత్తలు తీసుకుంది. అభ్యర్థులకు ఏవైనా అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే వాటిని ఎన్టీఏ అధికారిక పోర్టల్ ద్వారా లేదా జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
సోషల్ మీడియాలో లేదా వివిధ మెసేజింగ్ యాప్‌లలో ఎవరైనా ఫార్వర్డ్ చేసే అనుమానాస్పద లింకులపై