
Khushboo daughter:ఆనందిత సుందర్ తన బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, రూమర్లపై స్పందించారు. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి కుమార్తె అయిన ఆనంది
త తన ఫిట్నెస్ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. తాను బరువు తగ్గడానికి ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని, అలాగే ఓజెంపిక్ లేదా ఇతర బరువు తగ్గించే మందులు కూడా ఉపయోగించలేదని స్పష్టం చేశారు.
చిన్నప్పటి నుంచి తాను కాస్త బొద్దుగా ఉండేదాన్నని ఆనందిత చెప్పారు. అందువల్ల చాలా మంది తన రూపాన్ని చూసి విమర్శించేవారని ఆమె గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో మాత్రమే కాదు, బయట కూడా తన శరీరాకృతిపై అనేక వ్యాఖ్యలు వినాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఆ విమర్శలను పట్టించుకోకుండా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
“నేను ఒక్కసారిగా బరువు తగ్గలేదు. 2018లోనే నా ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఈ స్థాయికి రావడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. మధ్యలో వచ్చిన లాక్డౌన్ సమయంలో నా శరీరంలో పెద్ద మార్పు వచ్చింది. కానీ ఆ సమయంలో చాలా మంది నన్ను చూడలేదు. ఇప్పుడు ఒక్కసారిగా చూసి సర్జరీలు చేయించుకుందని అనుకుంటున్నారు” అని ఆనందిత అన్నారు.
“నన్ను చూసి ఓజెంపిక్ లేదా మౌంజారో వంటి మందులు వాడిందని కొందరు చెబుతున్నారు. అలాంటి వార్తలు చూస్తే నాకు నవ్వు వస్తుంది. నేను ఇతరులను మెప్పించడానికి బరువు తగ్గలేదు. నా ఆరోగ్యం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆమె స్పష్టం చేశారు. బరువు తగ్గిన తర్వాత కూడా, “సర్జరీలు చేసుకొని అకస్మాత్తుగా బరువు తగ్గింది. ట్రాన్స్జెండర్లా ఉంది,” అని తనను చాలామంది ట్రోల్ చేశారని నటి ఖుష్బూ కూతురు ఆనందిత వాపోయారు.
తనపై చిన్న వయసు నుంచే బాడీ షేమింగ్ జరిగిందని కూడా ఆనందిత ఆవేదన వ్యక్తం చేశారు. “నేను టీనేజ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది దారుణంగా మాట్లాడేవారు. వాళ్లు ఒక చిన్న పిల్లతో మాట్లాడుతున్నామనే ఆలోచన కూడా చేసేవారు కాదు. మా తల్లిదండ్రులు సెలబ్రిటీలు కావచ్చు, కానీ అందుకే మమ్మల్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు” అని ఆమె అన్నారు.
ఇక సినీ రంగంలో కూడా ఆనందిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో పని చేసిన అనుభవం ఆమెకు ఉంది. ఇటీవల విడుదలైన ఓ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.