
Prabhakar Daughter Divija New Movie: బుల్లితెరపై 'మెగాస్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ వారసత్వాన్ని పుచ్చుకుని ఆయన పిల్లలు ఇద్దరూ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కుమారు
డు చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ కూడా హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతోంది.
దివిజకు సినిమా ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. గతంలో ఆమె తన అన్న చంద్రహాస్ నటించిన 'రామ్ నగర్ బన్నీ' సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో వచ్చిన 'బ్రహ్మా ఆనందం' సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించారు. అయితే, ఈసారి మాత్రం ఆమె పూర్తిస్థాయి హీరోయిన్గా అలరించేందుకు సిద్ధమయ్యారు.
దివిజ ప్రభాకర్ హీరోయిన్గా నటిస్తున్న మొదటి చిత్రానికి 'వెంకట్రామయ్య గారి తాలూకా' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇది ఒక యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనుందని సమాచారం.
సతీష్ ఆవాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మురళీధర్ గౌడ్, సుధ, కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ వంటి సీనియర్ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు చిత్రబృందం ప్రమోషన్లను కూడా వేగవంతం చేసింది.
సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి ఫ్యాన్ బేస్ ఉన్న దివిజ, హీరోయిన్గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి!