
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో బ్రిటిష్ కాలం నాటి గుర్తులను తొలగిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. వలసవాద పాలనను గుర్తుచేసే 21 రోడ్లు, పలు బజార్ల పేర్లను మార్చి, వాటి స్థానంలో భారత జాతీయ...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో బ్రిటిష్ కాలం నాటి గుర్తులను తొలగిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. వలసవాద పాలనను గుర్తుచేసే 21 రోడ్లు, పలు బజార్ల పేర్లను మార్చి, వాటి స్థానంలో భారత జాతీయ నాయకులు, సైనిక అధికారులు, యుద్ధ వీరుల పేర్లను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (SCB) తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా మార్గాలకు కొత్త శోభ రానుంది.జూన్ 17న బోర్డు ప్రెసిడెంట్, బ్రిగేడియర్ ఎస్. రాజీవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. పాత పేర్లను తొలగించి, కొత్త సైన్ బోర్డులను ఏర్పాటు చేసే ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఎస్సీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ద్వివేది తెలిపారు. ఈ మార్పు దేశ సైనిక వారసత్వాన్ని, జాతీయ ప్రతీకలను గౌరవించుకునే విస్తృత ప్రయత్నంలో భాగమని ఆయన పేర్కొన్నారు.తాజా మార్పుల ప్రకారం, లిట్టన్ రోడ్డుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు అని, బోల్టన్ రోడ్డుకు అటల్ బిహారీ వాజ్పేయి మార్గ్ అని, నోబెల్ రోడ్డుకు ఏపీజే అబ్దుల్ కలాం మార్గ్ అని నామకరణం చేశారు. 2020 గల్వాన్ లోయ ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ బి. సంతోష్ బాబును స్మరించుకుంటూ బర్టన్ రోడ్డుకు 'సంతోష్ బాబు మార్గ్' అని పేరు పెట్టారు.అదేవిధంగా, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పలువురు అమరవీరులకు ఈ సందర్భంగా ఘన నివాళి అర్పించారు. పరమవీరచక్ర, ఇతర శౌర్య పురస్కార గ్రహీతలైన కెప్టెన్ విక్రమ్ బాత్రా (వెల్లింగ్టన్ రోడ్డు), మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (రిచర్డ్సన్