
ఎర్రచందనం గుర్తుకురాగానే చాలామందికి 'పుష్ప' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే దీని స్మగ్లింగ్ గురించి చాలానే చూపించారు. ప్రేక్షకులకు అది నచ్చింది కూడా.
Jun 18 2026 7:32 PM | Updated on Jun 18 2026 7:39 PM
ఎర్రచందనం గుర్తుకురాగానే చాలామందికి 'పుష్ప' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే దీని స్మగ్లింగ్ గురించి చాలానే చూపించారు. ప్రేక్షకులకు అది నచ్చింది కూడా. ఇప్పుడు ఈ తరహా కథతో తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఓ మూవీ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన టీజర్ లాంటి వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)
శివకార్తికేయన్-సాయిపల్లవి జంటగా 'అమరన్' సినిమా తీసిన రాజ్ కుమార్ పెరియసామి.. ప్రస్తుతం ధనుష్‌తో పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఓం' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడిస్తూ రెండున్నర నిమిషాల వీడియోని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా ఎర్రచందనం కొట్టడానికి అడవిలోకి వెళ్లిన కొందరు కూలీలు.. ఫారెస్ట్ అధికారులకు దొరికిపోతారు. ధనుష్ వచ్చి వీళ్లని కాపాడుతాడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయి.
'పుష్ప'తో పోలికేం లేదు గానీ ఎర్రచందనమే ఇందులోనే కీలకంగా ఉండనుందని అయితే అర్థమవుతోంది. ఓం: ఛాప్టర్ 1 (ఉదిరం: ద బ్లడ్ వుడ్) పేరుతో ఈ సినిమా రాబోతుంది. అంటే దీనికి మరిన్ని భాగాలు కూడా ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. ఈ మూవీలో ధనుష్ సరసన సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో అక్టోబరు 16న మూవీ థియేటర్లలోకి రానుందని కూడా ప్రకటించారు.
(ఇదీ చదవండి: హీరోగా మెగా డైరెక్టర్ కొడుకు.. కూతురు ఇప్పటికే హీరోయిన్)
హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)
పూరీ జగన్నాథ్ కూతురి లేటెస్ట్ లుక్ (ఫొటోలు)
అనార్కలి.. చీర.. కుర్తా.. ఏదైనా సరే మృణాల్ తర్వాతే (ఫొటోలు)
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో ఒకే సినిమా చేసింది(ఫొటోలు)
వదిలిపెట్టను..! ఫోటోకు దండే...!? CIకి జగన్ మాస్ వార్నింగ్
హౌస్ వైఫ్ అని చులకనగా చూసారు, 70 AI టూల్స్ నేర్చుకున్నా
ఎవడి అండతో రెచ్చిపోతున్నారు? చంద్రబాబుపై జగన్ ఫైర్
ప్రత్యక్ష సాక్షి వీడియోను జగన్‌కు చూపించిన సాయి కృష్ణ తల్లి