
RRR Twinkle Sharma Latest Photos: 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రారంభంలోనే 'కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా..' అంటూ తన మధురమైన గొంతుతో పాట పాడుతూ కనిపించిన ఆ చిన్నారి గుర్తుందా? ఆ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన ఆ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆమె ప్రస్తుత రూపం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విజువల్ వండర్ 'ఆర్ఆర్ఆర్' (RRR) సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా, ఆస్కార్ వేదికపై సైతం భారతీయుల సత్తా చాటింది.
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయింది. ముఖ్యంగా సినిమా కథను మలుపు తిప్పే 'మల్లి' అనే గోండు పిల్ల పాత్రను ఎవరూ మర్చిపోలేరు. మల్లి పాత్రలో నటించిన ఆ అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ. చండీగఢ్‌కు చెందిన ఈ చిన్నారి 'ఆర్ఆర్ఆర్' సినిమా కంటే ముందే చాలా ఉత్తర భారతదేశంలో ఫేమస్.
హిందీలో సూపర్ హిట్ అయిన 'డాన్స్ ఇండియా డాన్స్' రియాలిటీ షో ద్వారా ట్వింకిల్ శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ 'ఫ్లిప్‌కార్ట్' ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది.
ఈ క్రమంలోనే రాజమౌళి కంటపడటంతో ఆమెకు 'ఆర్ఆర్ఆర్'లో మల్లిగా నటించే బంపర్ ఆఫర్ దక్కింది.'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు ట్వింకిల్ శర్మ 8వ తరగతి చదువుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి ఆమె ఇంటర్మీడియట్ (ప్లస్ 2) కూడా పూర్తి చేసేసింది.
2022లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' థియేటర్లలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోతోంది. ఈ నాలుగేళ్లలో ట్వింకిల్ శర్మ లుక్ పూర్తిగా మారిపోయింది. అప్పుడు చిన్నపిల్లలా అమాయకంగా కనిపించిన మల్లి, ఇప్పుడు కాలేజీకి వెళ్లే గ్లామరస్
అమ్మాయిలా తయారైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, అప్పుడప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
ఇక దర్శకుడు రాజమౌళి విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే భారీ అడ్వెంచర్ సినిమా 'వారణాసి' పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇందులో మహేష్ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలతో ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.