
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pakistan Pink Tax Removed: ఎట్టకేలకు పాకిస్తాన్ తమ దేశ మహిళల అవసరాలను అర్థం చేసుకుని మహిళలు మాత్రమే ఉపయోగించే కొన్ని రకాల ఉత్పత్తులపై పన్నును రద్దు చేసింది.
ఈ నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి దాయాది దేశం పాక్‌కు. మహిళల అవసరాలను గుర్తించి పాకిస్తాన్ ప్రభుత్వం పింక్ టాక్స్ అదే నండి.. గర్భనిరోధక పన్నును రద్దు చేసింది. ఇది మహిళల్లో పరిశుభ్రత పట్ల మరింత అవగాహన పెంచబోతున్నట్టు అక్కడ ప్రభుత్వం చెబుతున్న మాట.
పాకిస్తాన్ అనే దేశం ఏర్పడినప్పటి నుంచే ఆ దేశం లింగ వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. భారతదేశం నుంచి ఏర్పడిన ఈ దేశంలో మహిళలు, వారి భద్రత గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటీవల, పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో అది తప్పని ఋజువు అయింది.
ఇటీవల, పాకిస్తాన్ ప్రభుత్వం మహిళల పరిశుభ్రతకు సంబంధించిన ఒక పన్నును రద్దు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏ పన్నును తొలగించింది? అరబ్ న్యూస్ నివేదిక ప్రకారం... పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల పింక్ టాక్స్‌ను రద్దు చేసింది. దీన్నే పీరియడ్ టాక్స్‌గా కూడా పిలుస్తుంటారు.
ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలతో పాటు మహిళలు ఉపయోగించే శానిటరీ నాప్కిన్ లపై ఉన్న పన్నును రద్దు చేసింది ఆ దేశం. ఇది దేశంలోని మహిళలకు ఓ రకంగా శుభవార్త అనే చెప్పాలి. తాజాగా రద్దు చేసిన టాక్సులతో పాకిస్తాన్లో ఇప్పుడు శానిటరీ నాప్కిన్లతో పాటు గర్భనిరోధక
మాత్రల ధరలు దిగిరానున్నాయి. ఇది మహిళల్లో పరిశుభ్రతపై అవగాహనను ప్రోత్సహించేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ చెప్పిన దాని ప్రకారం.. "మహిళల ఆరోగ్యం, గౌరవం, సామాజిక భాగస్వామ్యానికి శానిటరీ ఉత్పత్తులు అత్యావశ్యకం. పాకిస్తాన్ ప్రపంచంలో ఐదవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. కాబట్టి కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిగా పేర్కొంది.
పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అటౌల్లా తారర్ దీనిని ఉపశమన బడ్జెట్ అని పిలుపునిచ్చారు. "మనం అద్భుతమైన గొప్ప కాలంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఉన్నాము. అలాంటి టైమ్‌లో ఈ బడ్జెట్ తమ ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను పాకిస్తాన్‌లోని అనేక మహిళా సాధికారక సంస్థలు కూడా స్వాగతిస్తున్నాయి. ఇన్నేళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం.. మహిళల కోసం తీసుకున్న ఏకైక మంచి నిర్ణయం ఇదే సర్వత్రా ఆ దేశం తీసుకున్న నిర్ణయం పై ప్రశంసల వర్షం కురుస్తుంది.
పింక్ టాక్స్, లేదా పీరియడ్ టాక్స్, అనేది మహిళల పరిశుభ్రత ఉత్పత్తులపై విధించే పన్ను. ఈ టాక్స్ వలన ఆయా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. దీనివల్ల పేద మహిళలు వాటికి బదులుగా బట్టలను ఉపయోగించవలసి వస్తుంది. ఇది వారి పరిశుభ్రతకు భంగం కలిగిస్తుంది. ఈ ఉత్పత్తులపై 18 శాతం పన్నును తగ్గించాలన్న పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం వల్ల వాటి ధరలు ఇపుడు దిగిరానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.