
వృషభ రాశివారికి జులై నెల అద్భుతంగా ఉండనుంది. శుక్రుడు, బుధుడు, శని మూడు గ్రహాలు ఈ రాశికి శుభ స్థానంలో కదులుతున్నాయి. దీని కారణంగా వీరికి ఈ నెలంతా చాలా బాగుంటుంది. కొత్త ఇల్లు, వాహనం, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయం అందుకుంటారు.
ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుున్నాయి.ఆదాయం కూడా పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలోనూ బాగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జులై నెలలో జరిగే గ్రహాల మార్పులు..
మిథున రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.ఈ నెలలో ఈ రాశివారికి ఆగిపోయిన పనులు మళ్లీ పూర్తి చేస్తారు. ఏ పని చేసినా విజయం సాధించగలరు. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రతిదీ జరుగుతుంది. జీవితం ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది.శని గ్రహం కారణంగా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు.ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది.
ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జులై నెలలో సింహ రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. దేవుడి పట్ల నమ్మకం ఎక్కువగా పెరుగుతుంది.వ్యక్తిగత జీవితం కూడా ఆనందంగా మారుతుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సంతానం కోసం చూస్తున్నవారికి సంతానం కలిగే అవకాశం ఉంది. జీవితంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. జులై నెల తుల రాశివారికి చాలా బాగుంటుంది.ఈ నెల వీరికి చాలా శుభ సమయం.ఆకస్మికంగా ఆర్థిక లాభాలు అందుకుంటారు.
చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది.చిరకాల కోరికలు నెరవేరతాయి. సంతోషం రెట్టింపు అవుతుంది. డబ్బు పరంగా ఊహించని లాభాలు అందుకుంటారు. పని చేసే చోట కూడా మీ గుర్తింపు పెరుగుతుంది. జులై నెలలో కూడా వృశ్చిక రాశివారికి మహర్దశ మొదలౌతుంది.
, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తిలో పురోగతి లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు.
జీవితం ఆనందంగా మారుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఊహించని విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది.కొత్త ఇల్లు