
గత కొద్ది రోజులుగా భారత రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. పార్లమెంట్లో ప్రధాన రాజ్యాంగ సవరణ బిల్లులను సులభంగా ఆమోదించుకునేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కును అందుకోవడానికి అధికార ఎన్డీయే (NDA) కూటమి అడుగు దూరంలో నిలిచింది.
పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో చోటుచేసుకున్న రాజకీయ అలజడులు కేంద్రంలో అధికార కూటమికి సరికొత్త బలాన్ని తెచ్చిపెడుతున్నాయి. రాబోయే వర్షాకాల సమావేశాల నాటికే ఈ లక్ష్యం పూర్తయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో ఊహించని పెద్ద చీలిక వచ్చింది.
ఆ పార్టీకి చెందిన 28 మంది లోక్సభ సభ్యులలో 20 మంది ప్రతినిధులు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యారు. ఈ వర్గం ఇప్పుడు అధికార ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది.
ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్..!లోక్సభలో మారుతున్న సమీకరణాలుమరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) లోని తొమ్మిది మంది లోక్సభ సభ్యులలో ఆరుగురు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీరంతా ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేన వర్గంలో చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాలు లోక్సభలో ఎన్డీయే బలాన్ని మరింత పెంచడానికి దోహదం చేయనున్నాయి. దీనితో పాటు తమిళనాడుకు చెందిన డీఎంకే కూడా ఎన్డీయేకు పరోక్షంగా మద్దతు ఇచ్చే అంశంపై సంప్రదింపులు జరుపుతోంది.లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలంటే మొత్తం 543 స్థానాలకు గాను 362 ఎంపీల మద్దతు అవసరం.
అయితే ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఈ మ్యాజిక్ ఫిగర్ 360 వద్ద నిలిచింది. ప్రస్తుతం ఎన్డీయే సంఖ్యా బలం తిరుగుబాటుదారులతో కలిపి 318గా ఉంది
గత కొద్ది రోజులుగా భారత రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. పార్లమెంట్‌లో ప్రధాన రాజ్యాంగ సవరణ బిల్లులను సులభంగా ఆమోదించుకునేందుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ మార్కును అందుకోవడానికి అధికార ఎన్డీయే (NDA) కూటమి అడుగు దూరంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో చోటుచేసుకున్న రాజకీయ అలజడులు కేంద్రంలో అధికార కూటమికి సరికొత్త బలాన్ని తెచ్చిపెడుతున్నాయి. రాబోయే వర్షాకాల సమావేశాల నాటికే ఈ లక్ష్యం పూర్తయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో ఊహించని పెద్ద చీలిక వచ్చింది. ఆ పార్టీకి చెందిన 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది ప్రతినిధులు ప్రత్యేక గ్రూపుగా ఏర్పడి, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యారు. ఈ వర్గం ఇప్పుడు అధికార ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది. ఇది జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్..!లోక్‌సభలో మారుతున్న సమీకరణాలుమరోవైపు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) లోని తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులలో ఆరుగురు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అసలైన శివసేన వర్గంలో చేరే అవకాశం ఉంది. ఈ పరిణామాలు లోక్‌సభలో ఎన్డీయే బలాన్ని మరింత పెంచడానికి దోహదం చేయనున్నాయి. దీనితో పాటు తమిళనాడుకు చెందిన డీఎంకే కూడా ఎన్డీయేకు పరోక్షంగా మద్దతు ఇచ్చే అంశంపై సంప్రదింపులు జరుపుతోంది.లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలంటే మొత్తం 543 స్థానాలకు గాను 362 ఎంపీల మద్దతు అవసరం. అయితే ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో ఈ మ్యాజిక్ ఫిగర్ 360 వద్ద నిలిచింది. ప్రస్తుతం ఎన్డీయే సంఖ్యా బలం తిరుగుబాటుదారులతో కలిపి 318గా ఉంది. డీఎంకేకు సంబంధించిన 22 మంది లోక్‌సభ ఎంపీల మద్దతు కూడా లభిస్తే, ఎన్డీయే బలం అత్యంత ప్రతిష్టాత్మకమైన 348 మార్కుకు చేరుకుంటుంది. టీఎంసీ, శివసేన బాటలో ఎస్పీ ? యోగీ మంత్రి బిగ్ హింట్..!రాజ్యసభలోనూ అదే సీన్ రాజ్యసభలో కూడా ఇదే రకమైన సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఎగువ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి 164 మంది సభ్యుల బలం అవసరం కాగా, ప్రస్తుతం ఎన్డీయేకు 150 మంది సభ్యులు ఉన్నారు. డీఎంకేతో పాటు చిన్న పార్టీల మద్దతు కూడగడితే ఈ లక్ష్యం సులువుగా నెరవేరుతుంది. ఈ వ్యూహం ఫలిస్తే వర్షాకాల సమావేశాలలోనే కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ లాంటి ప్రతిష్టాత్మక అంశాలపై ప్రభుత్వం ముందడుగు వేయనుంది.