బాడీ బిల్డర్ మంచి ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. రోజూ జిమ్‌కు వెళ్లి కసరత్తు చేస్తారు.. ప్రతిరోజూ ప్రత్యేకంగా ఓ డైట్ ఉంటుంది. అంత ఫిట్‌గా ఉండే బాడీ బిల్డర్ గుండెపోటుతో చనిపోవడం చర్చనీయాంశమైంది. కర్ణాటకకు చెందిన బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
దావణగెరెలోని కేటీ జంబణ్ణనగరకు చెందిన సుశీల్ బాడీ బిల్డర్.. ఆయన మంగళవారం రాత్రి జిమ్‌కు వెళ్లారు.. అక్కడ కసరత్తులు చేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. సుశీల్ ఇంట్లోనే ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా పలితం లేకుండా పోయింది.
సుశీల్ అప్పటికే చనిపోయారని డాక్టర్లు గుర్తించారు. సుశీల్ కుమార్ బాడీ బిల్డర్‌గా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డర్ పోటీలకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇంతలో గుండెపోటుతో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. సుశీల్ తల్లి దేవమ్మ జిల్లా ఆసుపత్రిలో డి-గ్రూపు ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. బీపీ పడిపోవడంతో గుండెపోటు వచ్చి చనిపోయినట్లు డాక్టర్లు ప్రాథమికంగా గుర్తించారు. సుశీల్ కుమార్ మరణంపై దావణగెరె కేటీజే సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సుశీల్ మరణంతో తల్లి దేవమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. కరోనా మహమ్మారి విజృభించిన తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చాయని ఆనందించేలోపు కొన్నేళ్లుగా ఈ గుండెపోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో ఫిట్‌గా ఉండే యువకుల నుంచి చిన్న పిల్లల వరకు హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు.
అప్పటి వరకు బాగా యాక్టివ్‌గా ఉన్నవాళ్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలి గుండెపోటుతో చనిపోతున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డిలు గుండెపోటుతో మరణించారు. వీరిద్దరు రోజూ జిమ్‌కు వెళ్లే అలవాటు ఉన్నవారే..
మరణాలు అందరిని ఆందోళన కలిగిస్తున్నాయి.
కానీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం కలకలకం రేపింది. మరీ దారుణంగా స్కూల్ పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలా వరుసగా గుండెపోటు