ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ పోలీసులు ఆ గ్రామానికి పరుగులు పెట్టారు.. అక్కడ ఓ దున్నపోతుకు రాత్రంతా కాపాలాగా ఉన్నారు. దున్నపోతుకు పోలీసులు కాపలా ఉండటమేంటి.. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడమేంటని అందరూ ఆశ్చపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ తెలిసింది.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి దళితవాడలో 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ప్రతి ఏటా స్థానికంగా అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా మంగళవారం, బుధవారం జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అమ్మవారికి కుంభం పెట్టి దున్నపోతును బలివ్వడం ఆనవాయితీ. రూ.50వేలు ఖర్చు చేసి దున్నపోతును కొనుగోలు చేసి తీసుకొచ్చారు. కొంతమంది దున్నపోతు ఫోటోలు తీసి ఏకంగా ఢిల్లీలోని కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మూగ జీవాలను బలిస్తున్నారని..
అడ్డుకోవాలని కోరారు. ఇంతలో స్థానికులు జాతర కోసం మంగళవారం రోజు అమ్మవారి ఆలయం దగ్గర పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఆ వెంటనే ఊరిలో కరెంట్ పోయింది. ఇటు స్థానికులు జంతు బలిని ఆపాలని ఫిర్యాదు చేయడంతో ఢిల్లీలోని పశుసంవర్ధక శాఖ అధికారులు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ను సంప్రదించారు.
వెంటనే బలిని అడ్డుకోవాలని ఆదేవించారు.. ఆయన వెంటనే స్థానిక తహసీల్దార్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. తిమ్మిరెడ్డిపల్లిలో దున్నపోతును బలిని అడ్డుకోవాలని తహీసీల్దార్ సతీష్‌ను ఆదేశించారు. ఇటు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీని కూడా అలర్ట్ చేశారు.
వెంటనే రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కలిసి మంగళవారం రాత్రి తిమ్మరెడ్డిపల్లెకు వెళ్లారు అక్కడ దేవర దున్నపోతును బలి ఇవ్వనున్నారని తెలియడంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే దున్నపోతు బలిని ఆపాలని స్థానికులకు అధికారులు, పోలీసులు సూచించారు.40 ఏళ్లుగా తమ ఊరిలో ఈ ఆచారం కొనసగుతోందని స్థానికులు అధికారులు, పోలీసులకు చెప్పారు.
చేశామని చెప్పారు. అధికారులు మాత్రం బలి ఇవ్వడానికి వీల్లేదని హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బలిని ఆపేశారు.. దీంతో స్థానికులు కుంభం ఏర్పాటు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా దున్నపోతు దగ్గర పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం 10 గంటల వరకు దున్నపోతుకు కాపలాగా ఉన్నారు. బుధవారం రోజు తహసీల్దార్ సతీష్ ఆ ఊరికి చేరుకుని దున్నపోతును స్వాధీనం చేసుకుంటామన్నారు. స్థానికులు మాత్రం తాము దున్నపోతును రూ.50 వేలకు కొనుగోలు చేశామని.. తాము నష్టపోతామన్నారు. ఆ డబ్బులు ఇచ్చి దున్నపోతును తీసుకెళ్లొచ్చన్నారు.. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తమ ఊరి బాగు కోసమే బలి ఇస్తున్నామన్నారు. ఈ దున్నపోతు కోసం తాము రూ.50వేలు ఖర్చు