
Today Astrology June 18 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, జేష్ట మాసం, ఉత్తరాయణం, 2026 జూన్ 18వ తేదీ గురువారం. పండితుల మాటల ప్రకారం ఈరోజు కొత్త పనులు మొదలుపెట్టే రాశులు ఏవి? ఆర్థికంగా కలిసి వచ్చే రాశులు ఎవరివి?
అనేది ఇప్పుడు చూసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొంచెం ఒత్తిడి, ఇబ్బందులు ఉండొచ్చు. రోజంతా నెగెటివిటీ ఫీల్ అవ్వకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఫ్యామిలీలో సఖ్యత పెంచుకోవడానికి ట్రై చేయండి, దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.
మిథున రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగానే ఉంటుంది. కొత్త పనులు స్టార్ట్ చేయకండి. ఆర్థిక నష్టం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వర్క్ ప్లేస్‌లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో గొడవలకు వెళ్లకండి, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా శుభంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. డబ్బు పరంగా లాభం వస్తుంది, ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీలో పాజిటివిటీ పెరుగుతుంది. కుంభ రాశి వారికి ఈరోజు అంతా పాజిటివ్‌గా సాగిపోతుంది.
మంచి వార్తలు వింటారు, బిజినెస్ కూడా కలిసి వస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, అవి మీకు ఆర్థికంగా కలిసి వస్తాయి. మీన రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. స్టూడెంట్స్‌కు కూడా మంచి రోజే.
కొత్త పనులు కూడా మొదలుపెట్టవచ్చు.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)