
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Ketu Rahu Gocharam: నవగ్రహాల్లో చంద్రుడు, రవి తప్ప మిగిలిన గ్రహాలు అపుడపుడు వక్ర దిశలో ప్రయాణిస్తుంటాయి.
ఇక నవగ్రహాల్లో రాహువు, కేతువులు ఛాయా గ్రహాలు. ఇవి నిరంతరం వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూనే ఉంటాయి. డిసెంబర్లో రాహు, కేతువులు రాశులను మార్చుకోబోతున్నాి. ఇది ఈ యేడాది జరగబోయే ప్రధాన మార్పులలో ఒకటి. ఈ మార్పు ప్రతి రాశిపై ప్రభావాన్ని చూపనుంది.
డిసెంబర్ మొదటివారంలో రాహువు శనిదేవుడు రాశి అయిన కుంభం నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తుండగా.. అదే రోజున కేతువు కూడా చంద్రుని రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది. ఈ రెండు గ్రహాలు నిరంతరం 180 డిగ్రీల కోణంలో సంచరిస్తూ ఉంటాయి.
ఈ రెండు గ్రహాల సంచారం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో చూద్దాం... రాహువు మేష రాశి యొక్క కర్మతో పాటు వ్యాపార గృహంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సంచారం ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగించబోతున్నాడు. అయితే జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి.
మీ ఉద్యోగ విషయంలో ఇది మీకు మంచి సమయం అని చెప్పాలి. కన్యా రాశి.. కన్యా రాశి వారికి 11వ ఇల్లు లాభ స్థానం.. ఈ సంచారం వలన ముందుగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. ఆ తర్వాత మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఈ
రాహు సంచారం మీ లైఫ్‌ను కొత్త టర్న్ తీసుకునేలా చేస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఇదే అనువైన సమయం.
సింహ రాశి.. సింహరాశి వారికి ఈ సమయంలో అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ 12వ ఇంట్లో కేతువు సంచారం కారణంగా గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మీ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది. మిమ్మల్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు మీకు పూర్తి మద్దతు ఇవ్వబోతున్నారు. ఆకస్మిక ధనలాభం వలన నూతన గృహప్రాప్తి కలగనుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఈ యేడాది వివాహా యోగం సిద్ధించబోతున్నట్టు గ్రహగతులు చెబుతున్నాయి.
మీన రాశి.. మీనరాశి వారి 11వ ఇంట్లో రాహువు సంచారం వలన గతంలో చేసిన అప్పుల నుండి బయట పడతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ కోరిక నెరవేరే అవకాశాలున్నాయి. మీరు ఎంచుకున్న రంగాల్లో విజయం సాధిస్తారు. గతంలో కంటే మీరు చేసే పనిలో ఊహించని ఆర్థిక లాభాన్ని అందుకుంటారు. వివాహాం కానీ స్త్రీ, పురుషులు ఈ యేడాది కొత్త జీవితంలో అడుగుపెట్టడానికీ ఇదే అనువైన సమయం.
రాహువు మరియు కేతువు దేనికి బాధ్యత వహిస్తాయి..
వేద జ్యోతిషశాస్త్రంలో, కేతువు, రాహువు రెండూ ఛాయా గ్రహాలు. కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మికత, త్యాగం, మోక్షంతో పాటు నిర్దిష్ట సమాచారం వైపు నడిపించేలా చేస్తుంది. మీలో తార్కిక శక్తిని తట్టి లేపుతుంది. రాహువు మీ మనస్సుకు పరిపాలిస్తుంది. ఇది కోరికలు, భ్రమలు, ఇతర గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆకస్మిక లాభాలు, నష్టాలు, ప్రమాదాలు, వృత్తి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఈ రెండు గ్రహాలు పలు రాశులను ప్రభావితం చేస్తుంటాయి.
రాహువు, కేతువు దోష నివారణ.. రాహువు , కేతువు యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి, మీరు శివుని రూపమైన భైరవుడు లేదా దుర్గాదేవిని పూజించడం వలన మన:శాంతి లభిస్తుంది.అలాగే, రాహువు ఒక ఆలోచన అని గుర్తుంచుకోండి, కాబట్టి పరిహారాలతో పాటు మీ అలవాట్లను మెరుగుపరచుకోవడంపై దృష్టి సారించాలి. పరిశుభ్రతతో పాటు పారిశుధ్యం పై ధ్యానం పాటించాలి. రాహువు, కేతువు మంత్రాలను గురు ముఖత విని జపించండం వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.
Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని మేము క్లైయిమ్ చేయడం లేదు. ఈ గ్రహ గోచారం..ఆయా రాశుల్లో వాళ్లు పుట్టిన సమయంలో ఉన్న గ్రహ గతుల ఆధారంగా మారుతు ఉంటుంది. ఈ సమాచారంపై మరిన్న వివరాల కోసం సంబంధిత రంగంలోని పండితుడిని సంప్రదిస్తే బెటర్. జీ మీడియా న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.