
పార్టీని వీడేందుకు సిద్ధమైన ఆరుగురు ఉద్ధవ్ ఎంపీలు సమాజ్ వాదీ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు యూపీ మంత్రి వెల్లడి ఈనాడు, దిల్లీ: దేశంలో తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ), అఖిలేశ్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) రాజకీయ సంక్షోభాల ముంగిట నిలిచినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో శివసేన పార్టీ రెండోసారి చీలిపోయే స్థితిలో ఉంది.
లోక్‌సభలో ఆ పార్టీకున్న 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిందే శివసేనలోకి దూకడానికి సిద్ధమయ్యారు. తాము శిందే శివసేనలో విలీనం కావాలని నిర్ణయించినందున లోక్‌సభలో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని వారు లోక్‌సభ స్పీకర్ కార్యాలయానికి లేఖ పంపినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఉద్ధవ్ పార్టీ నాయకులు సంజయ్ రౌత్, అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్‌లు బుధవారం ఉదయమే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి తమ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించమని కోరితే అంగీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆ పార్టీ ముఖ్యనేత సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడుతూ ఒకవేళ ఎవరైనా పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.
‘‘గురువారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టాం. దానికి అందరూ రావాలని విప్ జారీచేశాం. గైర్హాజరైనవారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటించారు. లోక్‌సభలో ప్రస్తుతం సంఖ్యాపరంగా మూడోస్థానంలో ఉన్న సమాజ్వాదీపార్టీలోనూ త్వరలో ముసలం పుట్టుకురానున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ బుధవారం ప్రకటించడం సంచలనం రేపింది.
‘‘ఎస్పీలో భారీ చీలిక రానుంది. ఆ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. భాజపాలో చేరడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా కొంత ఆందోళనకరంగా స్పందించారు.
వారు పార్టీని వదులుకున్నట్లే’’అని పేర్కొన్నారు. ఎస్పీకి ప్రస్తుతం లోక్‌సభలో 37 మంది ఎంపీలున్నారు.
దిల్లీ: ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై పార్లమెంటుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు మరో పార్టీకి మారడం అనైతికం, చట్టవిరుద్ధం, రాజ్యాంగానికి వ్యతిరేకం అని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం కోర్టుదే అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు టీఎంసీ ఎంపీల చీలికపై తమ వాదన వినిపించేందుకు ఈ నెల 19న తన వద్దకు రావాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మరోసారి ఆహ్వానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
‘‘నయానో, భయానో పార్టీలను చీల్చడానికి భాజపా నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఎవరు భయపడతారో