
Ambati Rambabu: 23 సంవత్సరాల యువకుడు గాదె సాయికృష్ణ మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులే సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపారని, ఆపై నిజాలను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని మాయం చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
దేశ చరిత్రలోనే ఇంతటి అమానుషమైన లాకప్ డెత్ ఎక్కడా జరిగి ఉండదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Read also: Shyamala: హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు బాధిత యువకుడి మేనమామ నవరంగ్ తనను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నట్లు అంబటి రాంబాబు తెలిపారు.
సాయికృష్ణ కుటుంబం జనసేన పార్టీకి మద్దతుదారులైనప్పటికీ, ఈ అన్యాయంపై తాము స్పందిస్తున్నట్లు పేర్కొన్నారు. పుత్రశోకంతో అల్లాడిపోతున్న ఆ తల్లి వేదన వర్ణనాతీతమని, ఈ దారుణంపై రాజకీయ పక్షాలు, కులమతాలకు అతీతంగా అందరూ ఏకమై ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ఘోర ఉదంతంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీఐ (CBI) కి లేదా సిట్టింగ్ జడ్జికి అప్పగించాలని కోరారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
మానవతా దృక్పథంతో ఆలోచించి, చేతులు జోడించి వేడుకుంటున్నానని, వెంటనే సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. సాయికృష్ణ మేనమామ నవరంగ్ కూడా ఈ ఘటనపై మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక యువకుడి ప్రాణం పోయిన ఉదంతాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని హితవు పలికారు.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దాడి చేసి, ప్రాణాలు తీసి, గుట్టుచప్పుడు కాకుండా దహనం చేయడమేనా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటే? అని ఆయన ప్రశ్నించారు. కన్న బిడ్డను కోల్పోయిన ఆ తల్లి కి కలిగిన కడుపుకోత మరే కుటుంబానికి రాకూడదని కన్నీరు మున్నీరయ్యారు.
Movie : వెంకీ-అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా ?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Shyamala: హోంమంత్రి అనితపై శ్యామల సంచలన ఆరోపణలు
Perni Nani: అమర్నాథ్కు మద్దతుగా పేర్ని నాని.. పవన్ కల్యాణ్ పై విమర్శలు
Nara Lokesh: మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్
Achchennaidu: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి నష్టం: అచ్చెన్నాయుడు
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
AP Politics: “అనిత గొంతు నొక్కలేరు”: వైసీపీకి లోకేశ్ షాకింగ్ వార్నింగ్!
Venky -Anil Ravipudi