
Gitanjali mangal on sanchita ugale suicide mystery: షూటింగ్ సమయంలో తరచుగా సహనటుడు ఉజ్జ్వల్ శర్మ వేధిస్తుండే వాడని తనను బాడీ షేమింగ్ చేసే వాడని తనతో చెప్పుకునేదని సంచిత ఉగాలే క్లోజ్ ఫ్రెండ్స్ గీతాంజలి మంగల్ అసలు విషయాల్ని బైటపెట్టింది. దీంతో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
బుల్లితెర నటి ఫెమస్ కుంకుమ భాగ్య సీరియస్ ఫెమ్ సంచిత ఉగాలే జూన్ 14న మహారాష్ట్రలోని పాల్ ఘర్ లోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
తమ కూతురు చాలా యాక్టివ్ గా ఉండేదని కానీ తన లోపల ఇంత ఒత్తిడి ఉందని తాము అనుకొలేదని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ క్రమంలో సంచిత ఉగాలే క్లోజ్ ఫ్రెండ్ గీతాంజలి మంగల్ తాజాగా.. షాకింగ్ విషయాల్ని బైటపెట్టింది. సంచిత ఉగాలే తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని గీతాంజలి మంగల్ చెప్పుకొచ్చింది.
తామిద్దరం దిల్వాలీ దుల్హా లే జాయేగీ అనే మూవీలో చేశామని చెప్పింది. ఆ తర్వాత తాను సాజన్ ఘర్ సీరియల్ లో నటిస్తు బిజీగా ఉండేదని చెప్పింది. కానీ గతంలో తనకు ఇదే షోలో సహనటుడు అయిన ఉజ్జ్వల్ శర్మ తరచుగా వేధిస్తుండేవాడని తనతో చెప్పినట్లు అసలు విషయంను బైటపెట్టింది.
సంచితతో చేసిన వాట్సాప్ చాట్ లను కూడా బైటపెట్టింది. సహనటుడు ఉజ్జ్వల్ శర్మ తన ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని అది తిరిగి ఇవ్వమన్నప్పటి నుంచి వేధిస్తున్నాడని, బాడీషేమింగ్ చేస్తున్నాడని చెప్పినట్లు గీతాంజలి అన్ని విషయాల్ని ఒక్కొక్కటిగా బైటపెట్టింది.
తాను చాలా ఒత్తిడికి గురౌతున్నానని, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పిందని, పలు మార్లు ధైర్యం చెప్పినట్లు గీతాంజలి చెప్పుకొచ్చింది. గత 4-5 నెలలుగా తాము రోజూ మాట్లాడుకుంటున్నామని చెప్పింది. సంచిత ఉగాలే సూసైడ్ కు రెండు
రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నామని చెప్పింది. ఆ సమయంలో తాను చండీగఢ్‌లో ఉన్నానని మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదని దాంతో ఆమెకు సమయం ఇవ్వలేకపోయానని చెప్పింది.
కానీ సంచిత మాత్రం అంత ఒత్తిడిలో కూడా తన తండ్రి ఆరోగ్యం గురించి రెండు రోజుల ముందు కాల్ చేసి మరీ అడిగిందని చెప్పింది. తన సహానటుడి వేధింపుల వల్లనే సాజన్ ఘర్ ప్రాజెక్ట్ నుంచి బైటకొచ్చినట్లు కూడా చెప్పిందని గీతాంజలి పలు విషయాల్ని బైటపెట్టింది. సంచితకు ఫోన్ లో డైరీ రాసే అలవాటు ఉండేదని తనను ఎవరైన హర్ట్ చేసిన , వేధింపులకు గురిచేసిన దానిలో రాసుకునేదని గీతాంజలి చెప్పింది.
కానీ ఇటీవల చాలా డీప్రెషన్ కు గురైందని చెప్పింది. సంచిత ఉగాలేకు కుటుంబంతో మంచి బాండింగ్ ఉందని, సెట్స్ లలో ఆమె తల్లి తరచుగా ఆహరం తీసుకొని వచ్చేదని చెప్పింది. ఎప్పుడైన ఆరోగ్యం బాగాలేకపోతే వారి సొంతూరుకు వెళ్లేదని చెప్పింది. ఆమె తల్లిదండ్రులు సైతం బాగా సపోర్ట్ చేసేవారని గీతాంజలి చెప్పింది.
మరోవైపు సంచిత వద్ద డబ్బు అప్పుగా తీసుకున్నారన్న ఆరోపణలన్నింటినీ ఉజ్జ్వల్ ఖండించాడు. తన మాజీ ప్రియుడితో విడిపోయిన తర్వాత సంచిత బాధపడిందని ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఉజ్జ్వల్ చేసిన ఆరోపణలన్నింటినీ సంచిత స్నేహితులు గీతాంజలి ఖండించారు. దీనిపై ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది.