
Surya Vaibhav : శ్రీలంక ‘ఎ’ (Sri Lanka A) ఆటగాళ్లతో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మైదానంలో గొడవకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదాస్పద ప్రవర్తనపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైభవ్ క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించకూడదని, తక్షణ చర్యగా అతడిని జట్టు నుంచి పక్కన పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. “నేనే గనుక ఇండియా ‘ఎ’ జట్టుకు కోచ్‌గానో లేదా మేనేజర్‌గానో ఉండి ఉంటే.. క్రమశిక్షణా చర్యల కింద ఇవాల్టి అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి తప్పించి పక్కన బెట్టేవాడిని” అంటూ మంజ్రేకర్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా ట్వీట్ చేశారు.
Read Also : తెలివితేటలు మామూలుగా లేవుగా.. మొబైల్ ఫోన్ కవర్లో మద్యం దాచి స్టేడియంలోకి! క్రికెట్ క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రవర్తించడం ఎంతమాత్రం తగదని సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశారు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ సహనం కోల్పోకూడదని, భౌతిక దాడికి దిగడం లేదా దూకుడుగా ప్రవర్తించడం క్రీడా సంస్కృతి కాదని ఆయన విశ్లేషించారు.
మైదానంలో ఇటువంటి ప్రవర్తనలు సరికావని యువ ఆటగాళ్లకు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తప్పు తీవ్రతను వైభవ్‌కు తెలియజేయడానికైనా అఫ్గాన్ మ్యాచ్‌కు అతడిని దూరం పెట్టడమే సరైన నిర్ణయమని మంజ్రేకర్ గట్టిగా సమర్థించారు.
క్రీడా నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని ఈ మాజీ క్రికెటర్ యువ ఆటగాళ్లకు హితవు పలికారు. Sri Lanka : అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. India vs Afghanistan Match : గిల్, ఇషాన్ సెంచరీలు.. ఇండియా
భారీ స్కోరు
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
Rohit Sharma Record: 14000 పరుగుల క్లబ్లో హిట్‌మ్యాన్ సంచలనం.. సిక్సర్‌తో అరుదైన రికార్డ్!
Vishen Halambage Ban: వైభవ్ తో గొడవ.. లంక ప్లేయర్ హలంబగేపై 2 మ్యాచ్‌ల నిషేధం!
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపే రికార్డు.. మెస్సి, క్లోజే రికార్డులకు చెక్ పెడతాడా?
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ హ్యాట్రిక్.. బోణీ కొట్టిన అర్జెంటీనా