Reliance Jio Infocomm IPO: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే వారు ఎక్కువగా ఐపీఓల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారన్న సంగతి తెలిసిందే. చాలా వరకు ఐపీఓలు లిస్టింగ్ గెయిన్స్ అధికంగా అందిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగానే సబ్స్క్రిప్షన్ ఉంటుంది.
ప్రముఖ కంపెనీల విషయానికి వస్తే దీనికి డిమాండ్ అంతకుమించి ఉంటుందని చెప్పొచ్చు. రిటర్న్స్ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటాయని చెబుతుంటారు. ప్రముఖ కంపెనీల్లో ఐపీఓకు సంబంధించి షేర్లను దక్కించుకునేందుకు ఇన్వెస్టర్లు ఎగబడుతుంటారు. లక్కున్నోళ్లకు లాట్ తగిలితే..
అది మంచి ప్రీమియంతో లిస్టింగ్ అయితే కాసుల పంట పండినట్లే. భారతదేశంలో ఈ ఏడాది చాలా ప్రముఖ సంస్థలు ఈ పాటికే ఐపీఓకు రావాల్సి ఉన్నా వాయిదా పడిన సంగతి తెలిసిందే.వీటిల్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి, రిలయన్స్ జియో, ఫోన్ పే, ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్, ఫ్లిప్కార్ట్, ఓయో, జెప్టో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
వాస్తవానికి ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే వీటిల్లో చాలా రావాల్సి ఉన్నా.. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోవడంతో చాలా వరకు ప్రస్తుత ప్రణాళికల్ని నిలిపివేశాయి. ఫ్లిప్కార్ట్ వాయిదా వేసినట్లు గతంలోనే ప్రకటించింది.
ఇక రిలయన్స్ జియో కూడా కాస్త వెనుకడుగు వేసిన పరిస్థితులు కనిపించాయి. తొలి అర్ధభాగంలోనే వస్తుందని గతేడాది రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలోనే రిలయన్స్ బాస్ ముకేశ్ అంబానీ ప్రకటించగా.. అది కుదరలేదు. దీంతో వాయిదా పడిందనే అంతా భావించారు.
కానీ ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ప్రతికూలతల వల్ల ఆలస్యమైనప్పటికీ.. అతి త్వరలోనే జియో ఐపీఓ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దగ్గర ఈ వారమే ముసాయిదా పత్రాలు దాఖలు చేయనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
సుమారు 4 బిలియన్ డాలర్ల వరకు అంటే భారత కరెన్సీలో రూ. 36 నుంచి 40 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇదే జరిగితే భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. ఇప్పటివరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా రూ. 27 వేల కోట్లు సమీకరించి టాప్లో ఉంది. తర్వాత వరుసగా ఎల్ఐసీ, పేటీఎం ఉన్నాయి. ఇప్పుడు జియో వాటిని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక జియో మార్కెట్ విలువ కూడా గరిష్ఠంగా రూ. 15 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రిలయన్స్ షేరు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 శాతం వరకు పడిపోవడం, రిలయన్స్ ప్రధాన ఆదాయ వనరు పెట్రోకెమికల్స్ వ్యాపారంపై ప్రభావం పడటంతో నికర లాభం కూడా భారీగా తగ్గింది. మార్కెట్ ప్రతికూల పరిస్థితుల్లో ఐపీఓలు కూడా నెమ్మదించాయి. మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం ముగిసి.. ఇరాన్- అమెరికా డీల్ కుదరగా స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో మళ్లీ ఐపీఓలు వరుసగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నెల 19న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం నిర్వహించనుండగా దానికి ముందే డ్రాఫ్ట్ పేపర్లు సమర్పించే అవకాశం ఉందని తెలిపింది. జియో ఐపీఓ ద్వారా