
Bigg Boss Telugu 10 Contestants:తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10 త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది. పదో సీజన్ కావడంతో ఈసారి మరింత కొత్తదనంతో షోను తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నటి కస్తూరి శంకర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.
అలాగే ఆమె తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అందుకే బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఉంటే షోకు మరింత ఆకర్షణ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆమె పాల్గొనడంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరోవైపు ప్రముఖ టీవీ నటి ప్రియాంక నల్కర్ పేరు కూడా వినిపిస్తోంది.
తెలుగు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ప్రియాంకకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. గతంలో కొన్ని సినిమాల్లో కూడా నటించిన ఆమె తర్వాత సీరియల్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి మాట్లాడిన ప్రియాంక, గతంలో వచ్చిన అవకాశాలు కొన్ని కారణాల వల్ల వదులుకున్నానని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అయితే భవిష్యత్తులో అవకాశం వస్తే పరిశీలిస్తానని ఆమె తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఈ పేర్లన్నీ కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే. బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా కంటెస్టెంట్ల జాబితాను ప్రకటించే వరకు ఎలాంటి వార్తనైనా నిర్ధారిత సమాచారం అని చెప్పలేం.ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ఇలాంటి ఊహాగానాలు రావడం సహజం.
. చివరకు ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
కానీ ఈసారి పదో సీజన్ కావడంతో ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి