'పెద్ది' సినిమా రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే నిలబడింది.
11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రూ. 400 కోట్ల పోస్టర్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లిందని కమల్ ఆర్ ఖాన్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
కమల్ ఆర్. ఖాన్.. ఈయన గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు హిందీ, భోజ్ పురి సినిమాల్లో నటించిన ఈ అపర మేధావి.. తనకు తాను ఫిలిం క్రిటిక్ గా చెప్పుకుంటూ, సోషల్ మీడియా వేదికగా సినిమాలకు సమీక్షలు ఇస్తుంటాడు.
తనకు నచ్చని చిత్రాలపై విషం కక్కుతుంటాడు. సౌత్ హీరోలు, సినిమాలపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంటాడు. ఏదైనా పెద్ద మూవీ వస్తుందంటే చాలు, పని గట్టుకుని మరీ విమర్శలు చేస్తుంటాడు. ఈ వివాదాస్పద సమీక్షకుడు ఇప్పుడు 'పెద్ది' సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
''పెద్ది' సినిమా నిర్మాత ₹125 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తుంటే, తనను తాను స్టార్‌గా చెప్పుకునే రామ్ చరణ్ మాత్రం ఆ సినిమా సక్సెస్ అయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీడియా కూడా దీనిని 'హిట్' సినిమాగా పేర్కొంటోంది. మీడియా ఎంతటి సిగ్గులేని స్థితికి దిగజారిందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
హిందీ సర్క్యూట్లో ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లు కేవలం ₹15 కోట్లు మాత్రమే'' అని కమల్ ఆర్. ఖాన్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. దీనికి చరణ్ ని కూడా ట్యాగ్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేఆర్కేపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
మంచి వసూళ్లు రాబడుతున్న సినిమాపై కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.‘పెద్ది’ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ అయిపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్ సీస్, హిందీ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదని పేర్కొన్నారు. హిందీలో ఎంత వచ్చాయనేది ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఎవరి ఇష్టమొచ్చిన నంబర్స్ వాళ్లు చెబుతున్నారు. హిందీలో ఈ సినిమా రూ. 15 కోట్లు మాత్రమే వసూలు చేసిందని ఇప్పుడు కమల్ ఆర్. ఖాన్ అంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. తనను తాను స్టార్‌గా చెప్పుకునే హీరో అంటూ రామ్ చరణ్ పై కామెంట్స్ చేయడం చూస్తుంటే, కావాలనే ఈ పోస్ట్ పెట్టాడని అర్థమవుతోంది. గతంలోనూ ఈ మేధావి ఇలానే టాలీవుడ్ హీరోలపై హద్దులు దాటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఇకపోతే 'పెద్ది' సినిమాపై విమర్శలు చేసిన కమల్ ఆర్. ఖాన్.. అక్కడితో ఆగకుండా 'వారణాసి', 'ఫౌజీ' చిత్రాలపైనా అక్కసు వెళ్లగక్కారు. ''దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 'వారణాసి' సినిమా బడ్జెట్ రూ. 1000 కోట్లు. డిజిటల్ హక్కుల ద్వారా ఆయన రూ. 600 కోట్లు వస్తాయని ఆశించారు, కానీ నెట్‌ఫ్లిక్స్ కేవలం రూ. 110 కోట్లు మాత్రమే ఆఫర్ చేసింది. ఏ సినిమాకైనా రూ.150 కోట్లకు మించి చెల్లించకూడదని డిజిటల్ సంస్థలన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చాయి. దాంతో ఇప్పుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమలో 'డొనాల్డ్ ట్రంప్'లా మారిపోయారు. ఏం చేయాలో, ఎలా చేయాలో ఆయనకు పాలుపోవడం లేదు'' అని KRK పోస్ట్ పెట్టాడు.''మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రభాస్ తో ₹600 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఫౌజీ' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ సంస్థ కూడా దీని డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అందుకే, ట్రైలర్ విడుదలయ్యాక డిజిటల్ హక్కుల కోసం కనీసం ₹100 కోట్ల ఆఫర్ వస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. అంటే, సినిమా విడుదలకు ముందే నిర్మాతలు ₹400 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు లెక్క. కాగా, ప్రభాస్ గత చిత్రం 'రాజా సాబ్' విషయంలో నిర్మాతలు ఇప్పటికే ₹425 కోట్ల నష్టాన్ని చవిచూశారు'' అని కమల్ ఆర్. ఖాన్ మరో ట్వీట్ చేశాడు. వీటిపై మహేష్ బాబు, ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.
బాక్సాఫీస్ దగ్గర