
ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దైంది. తాజాగా ఈ నెల 21న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఈసారి భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నీట్ పేపర్ లీక్ కాకుండా టెలిగ్రామ్ యాప్ పై నిషేధం విధించింది.
దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్ష కోసం 15 కోట్ల మంది వాడే యాప్ ను నిషేధించడం ఏంటని టెలిగ్రామ్ బాస్ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా టెలిగ్రామ్ యాప్ నిషేధంపై ఇవాళ విమర్శలు గుప్పించారు.NEET 2026: నీట్ అభ్యర్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్-ఉచిత బస్సులు, హెల్ప్ డెస్క్ లు..!టెలిగ్రామ్ నిషేధంపేపర్ లీక్లను అరికట్టడానికి మోదీ ప్రభుత్వపు కొత్త ఎత్తుగడని రాహుల్ గాంధీ ఆరోపించారు.
అంటే, దొంగను పట్టుకోవడానికి బదులుగా, బాధితుడి ఇంటి తలుపుకు తాళం వేయడమన్నట్లుగా ఇది ఉందని రాహుల్ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్లోనే చదువుకొంటున్నారని, నోట్స్, టెస్ట్ సిరీస్లు, చర్చలు, ప్రిపరేషన్ కూడా ఇందులోనే ఉందన్నారు.
ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీక్లకు పరిష్కారం ఎలా అవుతుందని రాహుల్ ప్రశ్నించారు. ఇది కూడా నూటికి నూరుపాళ్లు సురక్షితం కాదని, ఈ విషయం దేశంలోని ప్రతి విద్యార్థికీ తెలుసని రాహుల్ వెల్లడించారు. పేపర్ లీక్ మాఫియాకు కూడా తెలుసని, మరి తదుపరి నిషేధం ఎవరిపై?
వాట్సాప్పైనా? అని రాహుల్ అడిగారు.కోటాలో యుద్దనినాదం...! జెన్ జీకి రాహుల్ ట్వీట్ ..!పరీక్ష రోజున, విద్యార్థులను సోదా చేస్తారని, కత్తెరలతో జేబులు కోసేస్తారని, ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపిస్తారని, నాటకాలకు కొదవే ఉండదని రాహుల్ ఎద్దేవా చేశారు.
కానీ ఈ వ్యాధి మూలంపై ఒక్క దెబ్బ కూడా పడదన్నారు. ఎందుకంటే ఈ పేపర్ లీక్ మాఫియా సరిగ్గా ఈ ప్రభుత్వ కళ్ల ముందే విజృంభిస్తూ
ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా రద్దైంది. తాజాగా ఈ నెల 21న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం.. ఈసారి భారీ ఎత్తున జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నీట్ పేపర్ లీక్ కాకుండా టెలిగ్రామ్ యాప్ పై నిషేధం విధించింది. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్ష కోసం 15 కోట్ల మంది వాడే యాప్ ను నిషేధించడం ఏంటని టెలిగ్రామ్ బాస్ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా టెలిగ్రామ్ యాప్ నిషేధంపై ఇవాళ విమర్శలు గుప్పించారు.NEET 2026: నీట్ అభ్యర్ధులకు ఆర్టీసీ గుడ్ న్యూస్-ఉచిత బస్సులు, హెల్ప్ డెస్క్ లు..!టెలిగ్రామ్ నిషేధంపేపర్ లీక్‌లను అరికట్టడానికి మోదీ ప్రభుత్వపు కొత్త ఎత్తుగడని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంటే, దొంగను పట్టుకోవడానికి బదులుగా, బాధితుడి ఇంటి తలుపుకు తాళం వేయడమన్నట్లుగా ఇది ఉందని రాహుల్ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్‌లోనే చదువుకొంటున్నారని, నోట్స్, టెస్ట్ సిరీస్‌లు, చర్చలు, ప్రిపరేషన్ కూడా ఇందులోనే ఉందన్నారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీక్‌లకు పరిష్కారం ఎలా అవుతుందని రాహుల్ ప్రశ్నించారు. ఇది కూడా నూటికి నూరుపాళ్లు సురక్షితం కాదని, ఈ విషయం దేశంలోని ప్రతి విద్యార్థికీ తెలుసని రాహుల్ వెల్లడించారు. పేపర్ లీక్ మాఫియాకు కూడా తెలుసని, మరి తదుపరి నిషేధం ఎవరిపై? వాట్సాప్‌పైనా? అని రాహుల్ అడిగారు.కోటాలో యుద్దనినాదం...! జెన్ జీకి రాహుల్ ట్వీట్ ..!పరీక్ష రోజున, విద్యార్థులను సోదా చేస్తారని, కత్తెరలతో జేబులు కోసేస్తారని, ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపిస్తారని, నాటకాలకు కొదవే ఉండదని రాహుల్ ఎద్దేవా చేశారు. కానీ ఈ వ్యాధి మూలంపై ఒక్క దెబ్బ కూడా పడదన్నారు. ఎందుకంటే ఈ పేపర్ లీక్ మాఫియా సరిగ్గా ఈ ప్రభుత్వ కళ్ల ముందే విజృంభిస్తూ, యువతను రక్త కన్నీరు కార్చేలా చేస్తోందన్నారు. మోదీ జీ ఈ నాటకాలు ఆపండి, మాఫియాపై దాడి చేయండి, విద్యార్థులపై కాదన్నారు. విద్యార్థుల ప్రతిధ్వనిని వినండి, లేకపోతే దేశ యువతకు తమ హక్కులను ఎలా సాధించుకోవాలో తెలుసన్నారు.