
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Nara Lokesh On DSC: ఏపీలో గతేడాది జరిగిన మెగా డీఎస్సీ నియామకంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుల నుంచి వస్తున్న అనేక ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉండి పెద్ద సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ..తాను 'గొడ్డలి' పార్టీ నాయకుల్లా బురదచల్లి పారిపాయే రకాన్ని కాదని అన్నారు. అలాగే డీఎస్సీపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అదే ప్రదేశంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
మంత్రి లోకేష్ సవాలు ఇదే! మెగా డీఎస్సీ నియామకంపై, దాని ప్రక్రియపై ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా.. వాటిని ఇక్కడే (జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో) నిలబడి సమాధానం చెప్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సవాస్ స్వీకరించే దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని ప్రతిపక్ష వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
అయితే మెగా డీఎస్సీపై వస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. వైఎస్ జగన్ ఎన్ని జన్మలెత్తినా.. ప్రస్తుతం జరుగుతున్న, జరగబోతున్న డీఎస్సీ నియామకాలను ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జాబ్ క్యాలెండర్లు కేవలం 'సాక్షి' పత్రికకే పరిమితమయ్యే క్యాలెండర్ల తాము రెడీ చేయలేదని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.
ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసిందని.. అదే విధంగా వాటి అమలుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే తాము అమలు చేసే జాబ్ నోటిఫికేషన్లను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.
గత ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క డీఎస్సీని కూడా సరిగ్గా నిర్వహించని వారికి.. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియ గురించి ఏం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కసారి డీఎస్సీ నిర్వహిస్తే కదా ఆ రిజర్వేషన్ల విధానంపై అవగాహన వచ్చేదంటూ మంత్రి చురకలు అంటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
నిరుద్యోగులకు మేలు చేసే విధంగా తమ కూటమి