
పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్‌కు రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 21న జరిగే నీట్-యుజి రీ-టెస్ట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని జూన్ 22 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది.
కేవలం యాప్ బ్లాక్ చేయడమే కాకుండా, జూన్ 30 వరకు భారతదేశంలో టెలిగ్రామ్‌లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ (Message-Editing) ఫీచర్‌ను డిసేబుల్ చేయాలని స్పష్టం చేసింది. ఎన్టీఏ (NTA) నివేదిక ప్రకారం.. టెలిగ్రామ్‌లో ఉండే పాత పోస్టులను ఎడిట్ చేసే సదుపాయాన్ని చీటింగ్ నెట్వర్క్స్ దారుణంగా దుర్వినియోగం చేశాయి.
పరీక్ష ముగిసిన తర్వాత, కేటుగాళ్లు తాము కొన్ని రోజుల క్రితం పెట్టిన పాత పోస్టులను ఎడిట్ చేసి, అందులో అసలైన క్వశ్చన్ పేపర్ ఫైళ్లను అటాచ్ చేస్తున్నారు. టెలిగ్రామ్ పాత టైమ్‌స్టాంప్‌ను (Original Timestamp) అలాగే ఉంచడం వల్ల.. పరీక్ష కంటే ముందే పేపర్ లీక్ అయిందనే భ్రమను కల్పించి విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు.
ఇందుకోసం “PAPER LEAKED NEET”, “Re-NEET 2026”, “Private Mafia” వంటి పేర్లతో గ్రూపులు పెట్టి రూ.వేల నుండి లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ ఛానెళ్లను బ్లాక్ చేస్తున్నప్పటికీ, వారు వెంటనే ప్రత్యామ్నాయ గ్రూపులు, బాట్లను (Bots) క్రియేట్ చేస్తుండటంతో..
కేవలం ఛానెళ్లను తొలగించడం సరిపోదని భావించిన ప్రభుత్వం ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైనే తాత్కాలిక నిషేధం విధించింది. ఈ వ్యవహారంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నేతృత్వంలో రాష్ట్ర పోలీసు విభాగాలు గట్టి నిఘా పెట్టాయి.
అంతర్రాష్ట్ర పరీక్షల మోసగాల ముఠాను అరెస్ట్ చేసిన అహ్మదాబాద్ పోలీసులు.. నకిలీ బ్యాంక్ ఖాతాల ద్వారా వీరు దాదాపు ₹1.5 కోట్ల విలువైన లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. బీహార్ పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఇప్పటికే విద్యార్థులకు ఇలాంటి పేపర్ లీక్ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ అడ్వైజరీ జారీ
చేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ భద్రతా చర్యలకు మద్దతుగా నిలిచిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా బెంచ్ విచారించనుంది.
Android 17 Features: ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Shivraj Singh Chouhan: ఈ ఏడాది 10 రాష్ట్రాలపై ఎల్‌నినో ప్రభావం.. రైతులకు కేంద్రం కీలక సూచనలు!
Uddhav Thackeray : పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలని లోక్‌సభ స్పీకర్‌కు ఉద్ధవ్ సేన లేఖ
Modi and Meloni:మనం ఇన్‌స్టాలో చాలా ఫేమస్..ఫ్రాన్స్ వేదికగా మోదీ-మెలోనీ క్రేజీ మీమ్స్!
G7 Summit in France : G7 శిఖరాగ్ర సమావేశం..ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ: చర్చకు రానున్న అంశాలు ఇవే
Wipro AI Training: 10,000 మంది ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వనున్న విప్రో
US EB-2, EB-5 Visa: EB-2, EB-5 వీసాలు నిలిపివేత!.. భారతీయులకు తీవ్ర నిరాశే!