చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం 2026 జూన్16 తేదీ మంగళవారం సాయంత్రం మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన రోజున పీర్ల(పంజా)ను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అల్లాహ్ ఆరాధించే సమయంలో బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తారు.
‘మొహర్రం’ అంటే పండుగ రోజు కాదు. ఈ పర్వదినాన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్నే ‘మొహరం’గా పేర్కొంటారు. ప్రాచీన కాలంలో అరబ్బులు(అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా) ఈ క్యాలెండర్‌ను వాడేవారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున అమరవీరులను స్మరించుకునే దినోత్సవంగా భావిస్తారు. అయితే ప్రాచీన కాలంలో అషూరా రోజున మొహర్రం మాసంలో పదో రోజున అనేక సంప్రదాయాలను అనుసరించి వేడుకలు నిర్వహించేవారు.
ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహర్రం నెలను తొలి మాసంగా పరిగణిస్తారు. చంద్రుడి దర్శనం తర్వాత ఈ పండుగ తేదీలను నిర్ణయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల పాటు మొహర్రం వేడుకలను జరుపుకుంటారు. పదో రోజు ఆషురా దినంగా పాటిస్తారు. అంతకుముందు రోజు ఉపవాస దీక్షను ఆచరిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల పండుగను పెద్ద పండుగగా జరుపుకుంటారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే దీనికి కారణం. పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడని డాక్టర్ టి.దోణప్ప తన జానపద కళా గ్రంథంలో వివరించారు.
అందుకే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలించిన ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు జరుపుకోవడం వందల ఏళ్ల నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. హజరత్ ఇమామ్ హుసేన్ త్యాగానికి గుర్తుగా పంజా(ప్రతిమ)లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు.
, హజరత్ ఉమర్ సైతం మంచి పరిపాలన అందించారు. అయితే వీరి తర్వాత వచ్చిన మావియా చక్రవర్తి అందరినీ హింసించేవారు. అనంతరం యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని క్రూరమైన పాలన సాగించాడు. ఆ సమయంలో హజరత్ హుసేన్ తన రాక్షసత్వాన్ని ఎదిరించి ప్రజల తరపున పోరాటం చేశాడు. శాంతికోసం హుసేన్ చేసిన ప్రతిపాదనలను యజీద్ తోసిపుచ్చి యుద్ధం ప్రకటించాడు.
ఆ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు దాదాపు 70 మంది వరకు అమరులవుతారు. అప్పుడు హజరత్ హుసేన్ ఆ తెగకు శాపం పెడతారు. వారికి ఎప్పటికీ మోక్షం ఇవ్వకండని అల్లాహ్‌ను వేడుకుంటూ ప్రాణాలు వదిలేస్తాడు. యుద్ధం ముగిసిన తర్వాత యాజిద్ తెగకు చెందిన వారు పశ్చాత్తాపం చెంది, అల్లాహ్ మేం తప్పు చేశాం, దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని హింసించి హతమార్చామని, తమని క్షమించమని గుండెల మీద బాదుకుంటూ, హల్బిద.. హల్బిద అని రక్తాలు చిందిస్తూ. రాత్రి సమయంలో భగ భగ మండే నిప్పులపై కాలికి కనీసం చెప్పులు కూడా లేకుండా కేవలం పాదాలతో నడుస్తారు. అప్పటినుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. Read Latest Religion News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు. జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు. వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు. సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి
చరిత్రను పరిశీలిస్తే, మహ్మద్ ప్రవక్త మరణం అనంతరం హజరత్ అబూబకర్ సిద్ధీఖ్, హజరత్ అలీ