
ఇంటర్నెట్డెస్క్: పాఠశాలల్లో అమలుచేసే కరిక్యులం ఎంపిక చేసే విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉండాలని కేరళ (Kerala) సీఎం వీడీ. సతీశన్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోకూడదన్నారు. కేంద్రం రూపొందించిన పీఎం శ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కూడిన ఉపకమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
ఆయన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం విలేకరులతో చెప్పారు. ఈ పథకాన్ని అమలుచేసేందుకు పాఠశాలలను ఎంపిక చేసే విషయంలో కూడా రాష్ట్రానికే స్వేచ్ఛ ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.99 కోట్లు అందాయని తెలిపారు.
దీని అమలుకు గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం జరిగిందని.. దీనికి సంబంధించిన నిధులను కూడా ఆ ప్రభుత్వమే తీసుకుందన్నారు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.