
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ప్రొటీన్ గురించి చర్చ కూడా ఎక్కువవుతోంది. శరీర ఎదుగుదల, కండరాల బలం, రోజువారీ శక్తి కోసం ప్రొటీన్ కీలకమని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రొటీన్ అంటే చాలామంది
కి గుడ్లు, చికెన్, చేపలు లేదా ఖరీదైన సప్లిమెంట్లే గుర్తుకొస్తాయి. దీంతో శాకాహారులు తమకు సరిపడా ప్రొటీన్ అందదేమోనని ఆందోళన చెందుతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. రోజూ మన ఇళ్లలో వాడే కొన్ని సాధారణ ఆహార పదార్థాల్లోనే మంచి మోతాదులో ప్రొటీన్ దొరుకుతుందని చెబుతున్నారు.పండ్లలో జామపండు ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సినది. సాధారణంగా జామను విటమిన్-సి కోసం తింటారు. కానీ ఇందులో ప్రొటీన్ కూడా గణనీయంగా ఉంటుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరికే ఈ పండు పోషకాల పరంగా మాత్రం చాలా విలువైనదిగా భావిస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సులభంగా తినగలిగే ఆహారం కావడం మరో ప్రత్యేకత.కూరగాయల విషయానికి వస్తే బఠానీ మంచి ప్రొటీన్ మూలంగా గుర్తింపు పొందింది. కూరల్లో, పలావ్‌లలో, స్నాక్స్‌లో తరచూ ఉపయోగించే బఠానీ శరీరానికి ప్రొటీన్‌తో పాటు పీచుపదార్థాన్ని కూడా అందిస్తుంది. అందుకే శాకాహారం తీసుకునేవారు దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.మన వంటింట్లో ఎప్పుడూ కనిపించే మినప్పప్పు కూడా ప్రొటీన్‌కు మంచి వనరు. ఇడ్లీ, దోశ, వడ వంటి వంటకాల ద్వారా ఇది దాదాపు ప్రతి ఇంట్లో ఆహారంలో చేరుతోంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో మినప్పప్పు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శనగపిండిలో కూడా ప్రొటీన్ మోతాదు