
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ఫ్రాన్స్ స్టార్ స్ట్రైకర్, కెప్టెన్ కిలియన్ ఎంబాపే సరికొత్త చరిత్ర సృష్టించాడు. సెనెగల్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను విజయపథంలో నడిపించడమే కాకుండా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఎవరికీ సాధ్యంకాని ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఎంబాపే లీడర్ షిప్ రోల్లో అదరగొట్టి ఫ్రాన్స్ జాతీయ జట్టు తరఫున సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. Read Also : TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ న్యూజెర్సీ వేదికగా సెనెగల్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ఫ్రాన్స్ 3-1 తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ.. సెకండ్ హాఫ్‌లో కిలియన్ ఎంబాపే తన మార్క్ ఆటతీరుతో మైదానంలో చెలరేగిపోయాడు. సెనెగల్ డిఫెన్స్‌ను చేధిస్తూ బ్యాక్-టు-బ్యాక్ రెండు అద్భుతమైన గోల్స్ సాధించి ఫ్రాన్స్ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.
ఎంబాపే మెరుపు దాడులతో ఫ్రాన్స్ విజయం నల్లేరుపై నడకలా మారింది. ఈ మ్యాచ్‌లో సాధించిన రెండు గోల్స్‌తో కిలియన్ ఎంబాపే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫ్రాన్స్ పురుషుల జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ వేదికలపై అత్యధిక గోల్స్ సాధించిన నంబర్ 1 ఆటగాడిగా ఎంబాపే నిలిచాడు.
ఇప్పటివరకు 57 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్న స్టార్ ప్లేయర్ ఒలివియర్ గిరౌడ్ రికార్డును ఎంబాపే (58 గోల్స్) అధిగమించాడు. కెరీర్లో బెస్ట్ ఫామ్‌లో ఉన్న ఈ ఫ్రెంచ్ కెప్టెన్.. అతి తక్కువ వయసులోనే ఈ ఆల్‌టైమ్ రికార్డును అందుకోవడం విశేషం.
వరల్డ్ కప్‌లో ఎంబాపే సృష్టిస్తున్న గోల్స్ సునామీతో వరల్డ్ ఫుట్‌బాల్ లెజెండ్స్ రికార్డులు ప్రమాదంలో పడ్డాయి. సెనెగల్పై చేసిన ఈ ట్విన్ గోల్స్‌తో ఎంబాపే.. ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన మిరోస్లావ్ క్లోజే, లియోనెల్ మెస్సి ల ఆల్‌టైమ్ రికార్డులకు మరింత చేరువయ్యాడు.
ఈ టోర్నీలోనే ఎంబాపే మరికొన్ని అంతర్జాతీయ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Bengaluru Horror: బెంగళూరులో దారుణం.. సహజీవనం చేస్తున్న యువతిని చంపేసి ఆపై లాయర్‌కు ఫోన్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ హ్యాట్రిక్.. బోణీ కొట్టిన అర్జెంటీనా
TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
FIFA World Cup Fan: తెలివితేటలు మామూలుగా లేవుగా.. మొబైల్ ఫోన్ కవర్లో మద్యం దాచి స్టేడియంలోకి!
Jonty Rhodes Meets Nara Lokesh:నారా లోకేశ్‌తో జాంటీ రోడ్స్ భేటీ!
Vaibhav Suryavanshi:ఐసీసీ రాడార్‌లో వైభవ్ సూర్యవంశీ.. లంక ప్లేయర్లతో ఫైట్.. నిషేధం తప్పదా?
Iran vs New Zealand: పొలిటికల్ టెన్షన్ల నడుమ వరల్డ్ కప్ మ్యాచ్ డ్రా!
ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే