అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 11 డాలర్ల వరకు పడిపోయింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4323 డాలర్ల వద్దకు దిగివచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.10 శాతం పెరిగింది.
దీంతో ఔన్స్ వెండి రేటు 70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండోవ రోజూ దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు క్రితం రోజు 10 గ్రాములకు రూ.160 తగ్గగా ఈరోజు మరో రూ.270 మేర దిగివచ్చింది.
దీంతో తులం బంగారం రేటు రూ.1,51,100 వద్ద ట్రేడవుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు నిన్నటి రోజున తులానికిరూ.150 తగ్గగా ఈరోజు మరో రూ.250 తగ్గింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.1,38,500 వద్దకు పడిపోయింది. దేశీయ మార్కెట్లో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది.
అయితే నిన్నటి రోజున హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.5000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో కిలో వెండి రేటు రూ.2,75,000 వద్దకు దిగివచ్చింది. ఈరోజు అదే ధర వద్ద ట్రేడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఇవాళ 1 గ్రాము బంగారం రేటు రూ.25 మేర తగ్గింది. దీంతో గ్రాము గోల్డ్ రేటు రూ. 13,850 వద్ద ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం రేటు రూ.1,38,500 వద్ద ట్రేడవుతోంది. రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.
ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి
ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి