
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. నియోజకవర్గ పరిధిలోని నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు శంకుస్థాపన చేశారు.
నంబూరు-మంగళగిరి సెక్షన్లోని 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన లోకేశ్, పెమ్మసానిలకు టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజుకు సుమారు 60 రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో గేటు మూసివేసే సమయం సగటున 8 నుంచి 10 గంటల వరకు ఉంటోంది. గేటు వేసిన ప్రతిసారీ ప్రయాణికులు 10 నుంచి 15 నిమిషాల పాటు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నిమిషంలోపే రైల్వే లైన్ను దాటే అవకాశం కలుగుతుంది.ఈ ఆర్వోబీ నిర్మాణం మంగళగిరి, రాజధాని అమరావతి, తాడికొండ నియోజకవర్గాల మధ్య అనుసంధానతను పెంచనుంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది.
అమరావతికి