
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Vadodara Bus Truck Accident 6 Killed: రాజస్థాన్ లోని వడదొర కోటంబి వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు తెల్లవారుజాము సమయంలో చోటుచేసుకుంది. బాలాజీ ట్రావెల్స్ కి చెందిన లగ్జరీ బస్సు, రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును బలంగా వెనకు నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ప్రాంతమంతా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సును కట్ చేసి, లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మృతదేహాలను బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన వారిని ఎస్ఎస్జీ ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆదిత్య పటేల్ వెంటనే ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది.
ఈ ఘోర ప్రమాదం కోటంబి హైవేపై జరగడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సహాయక చర్యల వల్ల హైవేపై కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నారు.