
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
V-Guard: ప్రముఖ వ్యాపార సంస్థ వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన సామాజిక బాధ్యతలో (CSR) భాగంగా చేపట్టిన నారీశక్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ముగింపు వేడుకలో భాగంగా స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించింది. ఈ వేడుకలో భాగంగా మహిళా సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, దేశవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో వీ-గార్డ్ మొత్తం 56 ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిందని సగర్వంగా ప్రకటించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఈ ప్రాజెక్టుల కోసం రూ. 7.13 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ప్రకటించింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హర్యానా వంటి 11 రాష్ట్రాల్లోని సుమారు 78,000 మంది ఈ సేవా కార్యక్రమాలతో లబ్ధి పొందారు.
సామాజికంగా అన్నివర్గాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వీ-గార్డ్ తన బాధ్యతను మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ సామాజిక బాధ్యతను చేపట్టినట్లు పేర్కొంది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రధానంగా విద్యా రంగంలో సంస్కరణలు తెచ్చి వ్యవస్థను బలోపేతం చేయడం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన చేయడం వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తూ..
2025-26 ఆర్థిక సంవత్సరంలో వీ-గార్డ్ చేపట్టిన CSR ప్రాజెక్టులు దేశాభివృద్ధిలో భాగం అయ్యాయి. నారీ శక్తి కార్యక్రమంలో వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వీ-గార్డ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రీనా మిథున్ చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ, "వీ-గార్డ్ తరపున మా సామాజిక బాధ్యత అనేది కేవలం కొన్ని కార్యక్రమాలకే పరిమితం కాదు.
, ఆరోగ్యం రంగాల్లో ఇలా మేము చేపట్టిన ప్రతి పని వెనుక, అందరినీ కలుపుకుని, నడిపించామని" ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, అలాగే చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేపట్టిన విస్తృత కార్యక్రమాలు ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది వీ-గార్డ్ చేపట్టిన సామాజిక అభివృద్ది కార్య క్రమాల్లో ప్రధానమైనవి, నవదర్శన్, తరంగ్ వంటి నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులు పలు రాష్ట్రాల్లో విజయవంతంగా సాగాయి.
నవదర్శన్ పేరిట ఒడిశా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 30 ప్రత్యేక పాఠశాలల్లో చికిత్స, వృత్తి విద్యా శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా 3,000 మందికి పైగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మద్దతునిచ్చింది.
తరంగ్ పేరిట కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 700 మందికి పైగా యువతకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రో-మెకానికల్ రంగాల్లో శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది.
ఇక విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాల్లోని 23 ప్రభుత్వ పాఠశాలలకు మద్దతుగా తరగతి గదుల ఆధునీకరణ, మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలను కల్పించింది. దీనివల్ల 9,700 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారు.
అలాగే తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, శానిటేషన్ సౌకర్యాలు డిజిటల్ లెర్నింగ్ పరికరాలను ఏర్పాటు చేసి, సురక్షితమైన విద్యా వాతావరణాన్ని అందించింది. ఆరోగ్య రంగంలో భాగంగా కేరళ రాష్ట్రంలోని కొచ్చి, అలప్పుజలో మహిళల మానసిక ఆరోగ్య అవగాహన త్వరితగతిన సలహాల కోసం 'ఎడం' (Edam) పేరుతో ఉచిత కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. స్వస్థ పథకం ద్వారా నిరుపేద రోగులకు 1,000 ఉచిత డయాలసిస్ సెషన్లను అందించింది.
ఇక ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన మల్టీ-స్పెషాలిటీ మెడికల్ క్యాంపుల ద్వారా 1,700 మందికి పైగా చికిత్స అందించి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరిచింది.
ఉత్తరాఖండ్, సిక్కిం, కేరళ తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను సమకూర్చింది.
'బిల్డ్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా తమిళనాడులో వాటర్ ట్యాంకుల ఏర్పాటు చెరువుల పునరుద్ధరణ ద్వారా సుమారు 6,000 మందికి స్వచ్ఛమైన తాగునీటిని అందుబాటులోకి తెచ్చింది.
ఉత్తరాఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో భద్రత, ఇంధన పొదుపు కోసం సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేసింది.
కేరళలో నదుల పునరుద్ధరణ పనులు చేపట్టింది, అలాగే పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతునిచ్చింది.
మహిళా సాధికారత కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా 'నారీ శక్తి' ద్వారా కేరళలో 120 మందికి పైగా మహిళలకు వృత్తి విద్యా శిక్షణ జీవనోపాధి కల్పించింది. హర్యానాలో మొబైల్ హెల్త్ సర్వీసుల ద్వారా 16,000 మందికి పైగా వైద్య సేవలు అవగాహన కల్పించింది.
వీ-గార్డ్ ఉద్యోగులు సామాజిక బాధ్యతలో భాగంగా 'వీ-సర్వ్' కార్యక్రమం ద్వారా 220 మంది ఉద్యోగులు 1,186 గంటలకు పైగా స్వచ్ఛంద సేవ చేశారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మొక్కలు నాటడం, బీచ్‌ల శుభ్రత, అడవుల పునరుద్ధరణ పాలియేటివ్ కేర్ వంటి పనుల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా, వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందరికీ సమానమైన అభివృద్ధికి పునాది వేస్తోంది. సమాజంలోని అట్టడుగు వర్గాల అవసరాలను తీరుస్తూ, శక్తివంతమైన సుస్థిరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా వీ-గార్డ్ ముందుకు సాగుతోంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వాణిజ్య ప్రయోజనాలు ఉన్న ప్రకటనగా భావించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
దీర్ఘకాలికంగా, స్థిరమైన మార్పును తీసుకువచ్చే వ్యవస్థలను నిర్మించడమే మా లక్ష్యం. విద్య