
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందే ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెబుదాం సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదే అమరావతి: గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రతిగడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత పార్టీ కేడర్ పై ఉందని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ… ఈనెల 25నుంచి ఆగస్టు 10వతేదీ వరకు 45రోజులపాటు ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి బూత్ స్థాయి వరకు నాయకులంతా రాష్ట్రంలోని ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేలా ప్రతి ఇంటికి కరపత్రాలు, బుక్ లెట్లు అందించాలన్నారు.
కూటమిలోని జనసేన, బీజేపీ కేడర్ ను కలుపుకొని వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇది అధినేత చంద్రబాబు ఆదేశంగా ఆయన చెప్పారు. చంద్రబాబునాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, దీంతోపాటు గత రెండేళ్లలో పెద్దఎత్తున చేపట్టిన సంక్షేమాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కేడర్ పై ఉందన్నారు.
తల్లికి వందనం, దీపం -2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలండర్లు, దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా రూ.4వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆటో డ్రైవర్ల సేవలో, అన్నదాత సుఖీభవ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని అన్నారు. చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే మనం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతుందని తెలిపారు.
, ఎమ్మెల్యేలు కూడా ప్రతిగడపకు వెళతామని తెలిపారు. ఈనెల 20వతేదీ వరకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో విజయోత్సవ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వ విజయాలపై ప్రజలను జాగృతం చేయాలన్నారు. ఇప్పటికే ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలి, దీనిపై ఇప్పటికే కేడర్ కు శిక్షణా తరగతులు నిర్వహించడంతోపాటు బీఎల్ ఏలను కూడా నియమించామని తెలిపారు. ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టం చేశారు. శాసనసభ్యులు బీఎల్ ఏలతో టచ్ లో ఉండి, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలి, ఎక్కడైనా సమస్య తీవ్రంగా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓటర్ వెరిఫికేషన్ సెల్ ను సంప్రదించాలని లోకేష్ చెప్పారు.
2014-19 నడుమ చేసిన మంచిపనులను చెప్పుకోలేకపోవడం, ప్రత్యర్థుల విషప్రచారం వల్లే ఓటమి పాలయ్యామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు మంత్రులు, ఎంపీలు