
హైదరాబాద్: తెలంగాణ ‘సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డులు’ మల్టీజోన్-2 ఉపసంచాలకుడు సుంకరి నరహరిరావుకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలోని నరహరిరావు నివాసంలో చేపట్టిన సోదాల్లో కట్టలు కట్టలుగా అవినీతి సొమ్ము బహిర్గతమైన విషయం తెలిసిందే.
ఏసీబీ బృందాలు మంగళవారం ఆయన ఇంటితోపాటు మరో 11 చోట్ల ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల విలువ రూ.13.05 కోట్లుగా లెక్కగట్టారు. అయితే, ఆయన అధీనంలోని స్థిరాస్తులన్నీ హైదరాబాద్ శివార్లలోని ప్రముఖ ప్రాంతాల్లో ఉండటంతో బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.100 కోట్లపైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నిన్న నరహరిరావును అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.