ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. అక్కడ ఎంఎస్ పూర్తిచేసి ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు. ఇంతలోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో తెలుగు విద్యార్థి సజీవ దహనమయ్యారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన దాట్ల సుబ్రహ్మణ్యంరాజు, పద్మావతి దంపతులు కోసిగి మండలం తుంబిగనూరు వచ్చి స్థిరపడ్డారు. సుబ్రహ్మణ్యం రాజు టీడీపీ నేతగా అందరికి సుపరిచితుడు.. ఆయన కుమారుడు కార్తీక్ వర్మ. భీమవరంలో సీఎస్ఈ బీటెక్ పూర్తిచేసిన కార్తీక్ వర్మ 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.
అక్కడ ఎంఎస్ పూర్తిచేశాఖ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు.. ప్రస్తుతం కాన్సాస్‌లో ఉంటూ తాత్కాలికంగా చిన్న ఉద్యోగం చేస్తున్నారు. కార్తీక్ వర్మ స్కైడైవింగ్‌లో శిక్షణ పొందితే ఉద్యోగాలు వస్తాయని భావించి ఇటీవలే కాన్సాస్‌లోని ఓ స్కై డ్రైవింగ్ శిక్షణ సంస్థలో చేరారు.
ఈ క్రమంలో శిక్షణ విమానంలో వెళుతుండగా.. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని 12 మంది సజీవ దహనమయ్యారు. ఆ ప్రమాదాన్ని అక్కడే మరో బ్యాచ్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు కూడా చూశారు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరగ్గా మంగళవారం తల్లిదండ్రులకు సమాచారం అందింది.
సుబ్రహ్మణ్యం రాజు భార్య అనారోగ్యం దృష్ట్యా ఆమెను స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా దువ్వకు తీసుకెళ్లారు. అక్కడ కుమారుడి మరణం గురించి చెప్పారు. సింగిల్ ఇంజిన్ ప్రైవేటు విమానం స్కై డైవింగ్ చేసేందుకు బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరింది.
టేకాఫ్ కాగానే కొద్దిసేపటికి సాంకేతిక లోపంతో కుప్పకూలి మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న పైలట్ సహా 12 మంది సజీవ దహనమయ్యారు. కార్తీక్ వర్మ మృతదేహం పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. అయితే తెలుగు సంఘాలు కార్తీక్ అవశేషాలను వీలైనంత త్వరగా భారత్‌కు పంపించడానికి రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
విషాదంలో ఉంది.
కార్తీ్క్ వర్మ మరణంతో ఆ కుటుంబం తీవ్ర